షూటింగులో ప్రమాదం..తీవ్రంగా గాయపడ్డ హీరో.. ఐసీయూలో చికిత్స

కొచ్చి: ప్రముఖ మలయాళం నటుడు టొవినో థామస్‌ షూటింగులో ప్రమాదం సంభవించడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన ప్రస్తుతం కాలా చిత్రంలో నటిస్తున్నారు. షూటింగ్‌లో గాయపడ్డ టొవినో థామస్ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. థామస్‌ను కొచ్చిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించి అక్కడ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. టొవినో థామస్ నటిస్తున్న కాలా చిత్రానికి రోహిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఓ యాక్షన్ సీక్వెన్స్ కోసం చిత్రీకరణ జరుగుతుండగా ప్రమాదం జరిగి టొవినో థామస్ తీవ్రంగా గాయపడినట్టు సమాచారం.

స్థానిక మీడియా కథనాల ప్రకారం టొవినో థామస్‌కు కడుపులో గాయమైనట్లు సమాచారం. కడుపు నొప్పి బాగా ఉందని చెప్పడంతో వెంటనే ఆయన్ను హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే కడుపులో రక్తం కారుతోంది. మరో 24 గంటలు గడిస్తేకానీ ఆయన పరిస్థితిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం లేదని వైద్యులు చెప్పినట్లు సమాచారం. గోదా, మారీ 2, అభియుము అనువం, మయానధి లాంటి హిట్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు పొందాడు టొవినో థామస్.త్వరలోనే మిన్నాల్ మురళి చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మధ్యే సినిమాకు సంబంధించిన టీజర్ విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకుల మన్ననలు పొందింది.

Malayalam Actor Tovino Thomas injured while shooting for his film Kala, Critical says doctors

Recommended Video

    Kerala Driver Car Parking Video | Man Behind This Sensation || Oneindia Telugu

    మిన్నాల్ మురళి చిత్రం కోసం వేసిన చర్చి సెట్టింగ్‌ను మే నెలలో కొందరు దుండగులు కూల్చడంతో తీవ్రంగా రియాక్ట్ అయ్యాడు టొవినో. కలదిలోని ఆదిశంకరాచార్య మఠం‌కు సమీపంలో చర్చి సెట్టింగు ఉండటంతో అంతరాష్ట్ర హిందూ పరిశత్ మరియు బజరంగ్‌దల్ కార్యకర్తలు ధ్వంసం చేశారు. అంతేకాదు చర్చిని తామే కూల్చినట్లుగా వీరు సోషల్ మీడియాలో పోస్టు చేసి ధృవీకరించారు. మతం పిచ్చితో కొట్టుకుపోతున్న వారిపై టొవినో థామస్ ఫేస్‌బుక్ పోస్టు ద్వారా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అప్పటి వరకు ఉత్తర భారతంలోనే సినిమా సెట్లను ధ్వంసం చేయడం చూశామని ఇప్పుడు ఆ సంస్కృతి దక్షిణ భారతంకు కూడా పాకిందని మండిపడ్డారు టొవినో థామస్.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+