ఖర్గే సెటైర్లు మామూలుగా లేవబ్బా
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ నేడు లోక్ సభలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలపై అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధినేత, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే ఘాటుగా స్పందించారు. తనదైన శైలిలో చురకలు అంటించారు. సెటైర్లు సంధించార. ఆత్మనిర్భర్ భారత్, వికసిత్ భారత్ అనే పదాలు వల్లె వేయడానికే పరిమితం అయ్యాయని, సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనలు నోటిలెక్కలుగా మారాయని వ్యాఖ్యానించారు.
మోదీ ప్రభుత్వం ఆలోచనలు కోల్పోయిందని మల్లికార్జున్ ఖర్గే అన్నారు. 2026-27 కేంద్ర బడ్జెట్ దేశ ఆర్థిక, సామాజిక, రాజకీయ సవాళ్లకు ఏ ఒక్క పరిష్కారాన్నీ చూపట్లేదని విమర్శించారు. బడ్జెట్ లో విధానపరమైన దార్శనికత, రాజకీయ సంకల్పం కొరవడ్డాయని, కనీసం విధాన లోపాన్ని కప్పిపుచ్చుకోవడానికి కూడా మోదీ ప్రభుత్వం ప్రయత్నించినట్లు కనిపించట్లేదని చెప్పారు. చెప్పుకోవడానికి ఓ సరైన నినాదం కూడా కరువైందని ఆరోపించారు.

'మిషన్ మోడ్' ఇప్పుడు 'ఛాలెంజ్ రూట్'గా తయారైందని, రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్ ఏ 'రిఫార్మ్' జంక్షన్ వద్ద కూడా ఆగకుండా వెళ్లిపోతుందని ఖర్గే సెటైర్లు వేశారు. విధానపరమైన దార్శనికత గానీ, రాజకీయ సంకల్పం అంతకంటే లేకుండా పోయిందని పేర్కొన్నారు. దేశానికి వెన్నెముకగా భావించే రైతులు, ఇతర అర్హత గల వర్గాల వారికి ఎటువంటి ఆర్థిక మద్దతు, ఆదాయ భద్రతా ప్రణాళిక కల్పించలేదని, వారి చూపులు ఎదురుచూపులేనని ఖర్గే తెలిపారు.
అసమానతలు బ్రిటిష్ రాజ్ కాలం నాటి స్థాయిలను మించిపోయాయని, బడ్జెట్ వాటిని ఎక్కడా ప్రస్తావించలేదని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, మైనారిటీ వర్గాలకు ఎటువంటి మద్దతునూ చూపలేకపోయిందని ఆయన ఆరోపించారు. ఆర్థిక సంఘం సిఫార్సులపై అధ్యయనం అవసరం గానీ, తీవ్ర ఆర్థిక ఒత్తిడిలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలకు అవి ఉపశమనం కలిగించవని ఖర్గే అభిప్రాయపడ్డారు. సమాఖ్య వ్యవస్థ బలహీనపడిందని ఆవేదన చెందారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications