తండ్రి ఘాతుకం: కూతురిపై రేప్ చేసి, గర్భం చేశాడు
తిరువనంతపురం: రక్షణగా ఉండాల్సిని తండ్రే బిడ్డను కాటేశాడు. అత్యంత నీచానికి ఒడిగట్టాడు. కేరళలో ఈ సంఘటన జరిగింది. కేరళలోని వైతిరిలో ఓ వ్యక్తి తన కూతురిపై అత్యాచారం చేశాడు. దీంతో ఆమె గర్భం దాల్చింది.
తన 16 ఏళ్ల కూతురు ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపిస్తుండడంతో తల్లి ఆమెను ఆస్పత్రికి తీసుకుని వెళ్లింది. దీంతో విషయం బయటకు వచ్చింది. బాలిక ఐదు నెలల గర్భవతి అని వైద్యులు తేల్చారు. ఈ విషయాన్ని వైతిరి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అబ్దుల్ షరీఫ్ చెప్పారు.

నిందితుడిని బుధవారంనాడు అరెస్టు చేసి, పొస్కో కింద కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. అతన్ని స్థానిక కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు అతనికి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 48 ఏళ్ల తండ్రి ఆ ఘాతుకానికి పాల్పడిన విషయం అత్యంత జుగుప్సాకరంగా ఉంది.












Click it and Unblock the Notifications