ఆరు నెలలుగా 15 ఏళ్ల కూతురికి తండ్రి లైంగిక వేధింపు
మంగళూరు: గత ఆరు నెలలుగా తన కూతురును లైంగికంగా వేధిస్తున్న వ్యక్తిని మంగళూరు పోలీసులు బుధవారం నాడు అరెస్టు చేశారు. నిందితుడిని మహమ్మద్ సుకూర్‌గా గుర్తించారు. అతని వయస్సు 47. అతను మాలూర్‌లో ఉంటున్నాడు.

అతను నగరంలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుతున్నాడు. ఇతను గత ఆరు నెలలుగా తన పదిహేనేళ్ల కూతురును లైంగికంగా వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని ఆ బాలిక తన పాఠశాల ఉపాధ్యాయురాలుకు చెప్పింది. ఆమె ఈ విషయాన్ని చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి తెలిపారు.
ఈ విషయాన్ని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు పోలీసులకు తెలిపారు. బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు మంగళవారం నాడు కేసు నమోదు చేశారు. నిందితుడిని మరుసటి రోజు (బుధవారం) అరెస్టు చేశారు. అతనిని మెజిస్ట్రేట్ కోర్టు ఎదుట హాజరుపర్చారు. బాలిక సంరక్షణను ఆమె బంధువుకు అప్పగించారు.












Click it and Unblock the Notifications