తన భార్యను రేప్ చేసి చంపేశారని పోలీసులకు ఫోన్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

నోయిడా: డయల్ 100. ఆపద సమయాల్లో ఆదుకునే ఆపద్భాందువు. ప్రజల రక్షణ కోసం ఏర్పాటుచేసిన ఈ పోలీస్ హెల్ప్ లైన్‌ను కొందరు ఆకతాయిలు సరదా కోసం వాడుకుంటున్నారు. డయల్ 100కు కాల్ చేసి పోలీసులతో పరాచకాలు ఆడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే నోయిడాలో జరిగింది. పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేసిన వ్యక్తి వారిని తప్పుదోవ పట్టించాడు. అడ్డంగా బుక్కై ప్రస్తుతం కటకటాలు లెక్కబెడుతున్నాడు.

నోయిడాకు చెందిన నరేష్ సింగ్ ఫేజ్ 2 పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇలహాబాస్ గ్రామంలో భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. బుధవారం తెల్లవారుజామున 5గంటల సమయంలో డయల్ 100కు ఫోన్ చేసిన ఆయన పోలీసులకు ఓ కంప్లైంట్ ఇచ్చాడు. తన భార్యను ఎవరో రేప్ చేసి చంపేశారన్నది దాని సారాంశం. కంట్రోల్ రూపం సిబ్బంది విషయాన్ని నరేష్ నివాసముంటున్న ప్రాంత పోలీసులకు తెలియజేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే అతను చెప్పిన చిరునామాకు చేరుకున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడి పరిస్థితి చూసి అవాక్కయ్యారు.

Man Complained Of Wifes Rape, Murder. Cops Were In For A Surprise

నరేష్ డయల్ 100కు ఫోన్ చేసి చెప్పినట్లు అక్కడ ఏమీ జరగలేదు. నరేష్ భార్యపై అత్యాచారం, హత్య వంటి ఘటనలు చోటు చేసుకోలేదు. ఆమె నిక్షేపంగా ఉండటంతో ఊపిరిపీల్చుకున్న పోలీసులు తమను ఉరుకులు పరుగులు పెట్టించిన నరేష్‌పై అగ్గి మీద గుగ్గిలమయ్యారు. రేప్, మర్డర్ కంప్లైంట్ చేసి పోలీసులకు తప్పు దోవ పట్టించినందుకు నరేష్‌పై కేసు బుక్ చేశారు. ఐపీసీ సెక్షన్ 107, 116, సీఆర్పీసీలోని సెక్షన్ 151కింద ఎఫ్ఐఆర్ నమోదుచేసి కటకటాల వెనక్కి నెట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+