Lockdown: వీడి లవ్ స్టోరీ ముందు టైటానిక్ సినిమా వేస్ట్, పెళ్లి కూతురు ఎవరంటే ? రియల్ హీరో !
కాన్పూర్/ ఉత్తరప్రదేశ్: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారిని అంతం చెయ్యడానికి దేశం మొత్తం లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ సందర్బంగా దేశంలో ఎక్కడో అక్కడ విచిత్రమైన సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. కోటీశ్వరులు పేదలను పెళ్లి చేసుకోవడం, కులాంతర, మతాంతర వివాహాలు చేసుకోవడం మనం నిజజీవితంలో, సినిమాల్లో చూస్తుంటాం. అయితే భిక్షం ఎత్తుకుంటున్న యువతికి లాక్ డౌన్ సందర్బంగా నెల రోజులకు పైగా ఆహారం అందిస్తున్న ఓ కారు డ్రైవర్ ఆమె ప్రేమలో పడి అందర్నీ ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. సినిమా స్టోరీలను తలతన్నే విధంగా ఉన్న ఈ స్టోరీ మనదేశంలోనే ప్రముఖ నగరంలో జరిగింది. వీరి లవ్ స్టోరీ ముందు టైటానిక్ లవ్ స్టోరీ కూడా చాల చిన్నదిగా కనపడుతోంది.

లాక్ డౌన్ లో పేదలకు ఆహారం
లాక్ డౌన్ అమలు కావడంతో కార్మికులు, కూలీలకు, బిక్షగాళ్లకు దేశంలోని అన్ని ప్రాంతాల్లో దాతలు వారికి ఆహారం అందిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో భిక్షగాళ్లకు ఆహారం ఇవ్వడానికి ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి వెళ్లాడు. యజమాని దగ్గర కారు డ్రైవర్ గా పని చేస్తున్న అనిల్ అనే యువకుడు ఆయన తోపాటు కాన్పూర్ లోని పలు ప్రాంతాల్లో తిరిగాడు.

ఫుట్ పాత్ పై దీనంగా యువతి
బిక్షగాళ్ళ పక్కన నీలమ్ అనే యువతి ఆహారం కోసం ఎదురు చూస్తున్న విషయం అనిల్ గుర్తించాడు. తరువాత భిక్షగాళ్లతో పాటు ప్రతిరోజు నీలమ్ కు ఆహారం అందిస్తున్న అనిల్ ఆమెను పలకరించాడు. నువ్వు ప్రతిరోజు ఇక్కడ ఆహారం తీసుకుంటున్నావు, నువ్వు ఎవరు ? నీ పేరు ఏమిటి, నీ కుటుంబ సభ్యులు ఎవరు ? చూస్తే నువ్వు భిక్షం ఎత్తుకునే అమ్మాయిలాగా కనపటం లేదే అని అనిల్ నీలమ్ ను ప్రశ్నించాడు.

నీలమ్ సినిమా కష్టాలు
తన తండ్రి చనిపోయాడని, తన తల్లి పక్షవాతంతో మంచం పట్టిందని నీలమ్ అనిల్ కు చెప్పింది. తనను, తన తల్లిని చూసుకోవడానికి తన సోదరుడు, అతని భార్య అంగీకరించలేదని నీలమ్ చెప్పింది. అంతే కాకుండా తన సొంత సోదరుడు, అతని భార్య తనను చితకబాది ఇంట్లో నుంచి బయటకు గెంటేశారని, తన తల్లిని పోసించడానికి వేరే మార్గం లేక ఇలా భిక్షం ఎత్తుకుంటున్నానని నీలమ్ కన్నీళ్లు పెట్టుకుంది.

ఫుట్ పాత్ మీద ప్రేమలో పడ్డాడు
నీలమ్ చెప్పిన మొత్తం కథ విన్న అనిల్ చలించిపోయాడు. నీలమ్ ఇంటి దగ్గరకు వెళ్లిన అనిల్ ఆమె తల్లికి ధైర్యం చెప్పాడు. ఎలాగైనా నీలమ్ ను పెళ్లి చేసుకుని ఆమెకు కొత్త జీవితం ఇచ్చి ఆమె తల్లిని చూసుకోవలని నిర్ణయించుకున్నాడు. తనను పెళ్లి చేసుకుంటావా ? అంటూ నీలమ్ ను ప్రశ్నించాడు. అనిల్ ను పెళ్లి చేసుకోవడానికి నీలమ్ అంగీకరించింది. ఇలా లాక్ డౌన్ సమయంలో భిక్షగాళ్ల మధ్యలో నీలమ్, అనిల్ ప్రేమించుకుని ఓ ఇంటివారు కావడానికి సిద్దం అయ్యారు.

పెళ్లికి గ్రీన్ సిగ్నల్
అనిల్ ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి దగ్గర కారు డ్రైవర్ గా పని చేస్తున్నాడు. అనిల్ కు సొంత ఇళ్లు ఉంది. తాను నీలమ్ ను ప్రేమించానని, మీరే పెళ్లి చెయ్యాలని అనిల్ అతని యజమానికి చెప్పాడు. అనిల్ పెళ్లి విషయం గుర్తించి అతని యజమాని స్వయంగా అతని కుటుంబ సభ్యులతో మాట్లాడాడు. అనిల్ ఓ భిక్షగత్తెను పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో మొదట అతని కుటుంబ సభ్యులు షాక్ కు గురైనారు. తరువాత పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

పెళ్లి పెద్దలు, విందు ఎలా ఇచ్చారంటే ?
అనిల్, నీలమ్ ల వివాహానికి అతని కుటుంబ సభ్యులు పలువురు సామాజిక కార్యకర్తలు హాజరైనారు. పెళ్లి చేసుకున్న అనిల్, నీలమ్ వారిని ఒక్కటి చేసిన భిక్షగాళ్లకు పెళ్లి విందు భోజనం అందించారు. పెళ్లి వంటకాలు చేసిన అనిల్, నీలమ్ దంపతులు ఫుట్ పాత్ మీద ఉన్న భిక్షగాళ్లకు వారే స్వయంగా పంచిపెట్టారు. ఇప్పటి వరకు సినిమాల్లో చూసిన ఇలాంటి ప్రేమ కథలు నిజజీవితంలో కూడా జరుగుతాయని అనిల్, నీలమ్ నిరూపించారు. ప్రస్తుతం అనిల్, నీలమ్ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భిక్షం ఎత్తుకుంటున్న ఓ యువతిని ప్రేమించి అందర్నీ ఒప్పించి పెళ్లి చేసుకున్న కారు డ్రైవర్ అనిల్ నువ్వు నిజంగా రియల్ హీరో అంటూ అతన్ని పలువురు అభినందిస్తున్నారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications