ప్రేయసి మోసంతో రూ.25 వేలు లాభం..? ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయ్ బ్రో..!!

Heartbreak Insurance Fund: అమ్మాయిలను అబ్బాయిలు మోసం చేయటం అనేది పాత జమానా. కొన్నేళ్ల కిందట అబ్బాయి మోసం చేశాడు, ప్రేమించి చివరికి వదిలేశాడు వంటి వార్తలు ప్రధానంగా కనిపించేవి. అయితే ఇటీవలి కాలంలో చూస్తే ట్రెండ్ మారింది. అమ్మాయి మోసం చేయటంతో ఆత్మహత్య చేసుకున్న అబ్బాయి లాంటి వార్తలు పెరిగాయి. అయితే ఇలాంటి వాటికి ఒక జంట పరిష్కారాన్ని కనుక్కున్నారు.

అవునండి బాబు ప్రేమికులుగా కలిసుండటానికి లేదా విడిపోవటానికి చాలా కారణాలు ప్రభావితం చేస్తుంటాయి. అయితే ఈ క్రమంలో ఎవరు మాట తప్పినా మరొకరు బాధకు గురవుతారు. ఎందుకంటే సంబంధం ముగిసినప్పుడు బ్రేకప్ చాలా బాధను కలిగిస్తుంది. పైగా మానసికంగా వారితో కలిగిఉన్న ఎమోషనల్ బాండింగ్ కోల్పోవటం ఒత్తిడి, ఆందోళనలకు కూడా కారణమౌతుంది. ఇలాంటి క్రమంలో ఒక యువకుడు తన ప్రేయసి మోసం చేయటంతో రూ.25 వేలు పరిహారంగా పొందాడు.

man got 25000 as compensation for breaking with girl friend after being cheated trending now

విషయంలోకి వెళితే.. ప్రతీక్ ఆర్యన్ అనే యువకుడు తన గర్ల్ ఫెండ్ నుంచి రూ.25,000 పరిహారంగా పొందాడు. వారిద్దరూ రిలేషన్ షిప్ ప్రారంభించే సమయంలో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. దాని ప్రకారం ప్రతి నెల ఇద్దరు రూ.500 ఒక జాయింట్ ఖాతాలో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. రిలేషన్ లిప్ లో ఉన్న సమయంలో ఇద్దరిలో ఎవరు మరొకరిని మోసం చేస్తే వారికి ఈ ఖాతాలోని డబ్బు నష్టపరిహారంగా అందుతుంది. దీనికి అతడు హార్డ్ బ్రేక్ ఇన్సూరెన్స్ ఫండ్ అని పేరు పెట్టుకున్నాడు.

దీనిపై నెటిజన్లు సైతం తమదైన శైలిలో స్పందిస్తున్నారు. తాను ఆప్షన్లలో పెట్టుబడి పెట్టాలని చూస్తున్నానని.. దానికంటే ఇందులోనే ఎక్కువ డబ్బు రాబడి వచ్చేలా కనిపిస్తోందని ఎవరైనా నాతో జతకడతారా అంటూ ఒక యూజర్ దీనికి రిప్లై ఇచ్చాడు. మరొకరైతే మీరు డబ్బు వచ్చినందుకు ఆనందంగా ఉన్నారా లేక మోసపోయినందుకు బాధపడుతున్నారో నాకైతే అర్థం కావటం లేదు. దీనిని చూసిన చాలా మంది ఈ ఐడియా ఏదో బాగుందే అంటూ కితాబిస్తున్నారు. చాలా మంది ఈ జంట ఆలోచనకు సెల్యూట్ చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+