Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పోలీస్ హెల్ప్‌లైన్‌కు పోర్న్ క్లిప్స్: దర్యాప్తు చేయాలని..

Man held for sending porn clip to police helpline
న్యూఢిల్లీ: ఓ ప్రబుద్ధుడు ఏకంగా అవినీతి నిరోధక పోలీస్ హెల్ప్‌లైన్‌కే పోర్న్ క్లిప్స్(శృంగార చిత్రాలు)ను వాట్సప్ ద్వారా పంపించాడు. అంతేగాక తాను పంపించిన వీడియో క్లిప్స్‌పై దర్యాప్తు జరపాలని కోరాడు. ఇక పోలీసులు ఊరుకుంటారా? దర్యాప్తు జరిపి అతడ్ని బుధవారం సాయంత్రం జైలుకు తరలించారు. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది.

సాధారణంగా పోలీసులు తమకు అందిన ప్రతి వీడియో, అడియో క్లిప్స్‌ను పరిశీలించి, దర్యాప్తు జరిపిన తర్వాత ఆ నివేదికను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిస్తారు. అక్కడ నివేదిక ప్రామాణికత నిర్ధారించబడుతుంది. అనంతరం కేసుకు సంబంధించిన చర్యలు తీసుకుంటారు. ఈ పోలీస్ ప్రత్యేక విభాగాన్ని ఆగస్టు 6న ప్రారంభించారు. కాగా, తమకు నిందితుడి వద్ద వచ్చిన ఈ పోర్నోగ్రాఫిక్ చిత్రాలను చూసిన పోలీసులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.

దీంతో ఆ వీడియో క్లిప్స్ పంపిన వ్యక్తిపై బరఖంభ రోడ్ పోలీస్ స్టేషన్‌లో మంగళవారం రాత్రి కేసు నమోదైంది. ఆ తర్వాత నిందితుడి గురించిన దర్యాప్తు జరిపారు. వీడియో క్లిప్స్ పంపిన నెంబర్‌ను ట్రాక్ చేసిన పోలీసులు బుధవారం సాయంత్రం ఫరీదాబాద్‌లో నిందితుడ్ని అరెస్ట్ చేశారు. నిందితుడు మహేందర్ 10వ తరగతి వరకు చదవాడనీ, ఆ తర్వాత ఓ మాల్‌లో పనిచేస్తున్నాడని స్థానికులు చెప్పారు.

కాగా, ఆ వీడియో క్లిప్స్‌ను అతడు తమకెందుకు పంపించాడని పోలీసులు విచారణ జరుపుతున్నారు. మద్యం మత్తులో పని చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. అయితే మహేందర్ మాత్రం.. పోర్నోగ్రాఫిక్ పరిశ్రమను లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే పోలీసులకు ఈ వీడియో క్లిప్స్‌ను పంపించానని తెలిపాడు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+