మాజీ ప్రియురాలి నగ్నచిత్రాలు ఫేస్‌బుక్‌లో పెట్టి వేధింపులు: జైలు

దుబాయ్: మాజీ ప్రియురాలికి ఆమె నగ్న చిత్రాలు చూపించి.. తనను పెళ్లి చేసుకోవాలని వేధింపులకు గురిచేస్తున్న ఓ శ్రీలంక దేశస్తుడికి దుబాయ్ కోర్టు మంగళవారం 6 నెలల జైలు శిక్ష విధించింది. ఈత శిక్షకుడిగా విధులు నిర్వహిస్తున్న నిందితుడు(34) భారత్‌కు చెందిన యువతితో గతంలో వ్యక్తిగతంగా సన్నిహితంగా ఉన్నాడు.

అప్పట్లో ఆమెతో శరీరక సంబంధం ఏర్పరచుకున్న నిందితుడు.. ఆమె నగ్న చిత్రాలను తీశాడు. ఇప్పుడు వాటిని చూపించి, తనను పెళ్లి చేసుకోవాలని లేదంటే.. ఆ చిత్రాలను కుటుంబసభ్యులకు చూపిస్తాని బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడు.

Man jailed in UAE for trying to force ex-girlfriend into marriage

అంతేగాక ఆ ఫొటోలను అతను ఆమె మామ ఫేస్‌బుక్ ఖాతాలో పోస్టు చేశాడు. ఆ యువతి సోదరికి కూడా వాట్సప్ ద్వారా పంపాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు, కోర్టులో ప్రవేశపెట్టారు.

ఇప్పటికే తాను 2000 దిర్హామ్స్(540 డాలర్ల)ను నిందితుడికి ఇచ్చానని, ఆ తర్వాత తాను డబ్బులు ఇవ్వకపోవడంతో అతడు తనను తన నగ్న చిత్రాలను చూపించి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని బాధితురాలు కోర్టులో తెలిపింది. విచారించిన కోర్టు నిందితుడికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది. శిక్షకాలం పూర్తయిన తర్వాత దేశం నుంచి అతడ్ని పంపించివేయాలని ఆదేశించింది. కాగా, బాధితురాలికి సంబంధించిన ఫొటోలను కోర్టీ సీజ్ చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+