ఇదేంది.. పెళ్లి కొడుకు పక్కన ఉండగానే, పెళ్లి కూతురుకు ముద్దుల వర్షం..
పెళ్లి సమయంలోనూ చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. వధువు/ వరుడు ఇష్టం లేదని చెప్పడమో.. బైక్, కట్నం కావాలని కోరడమే చూస్తున్నాం. కానీ ఓ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వరుడు పక్కన ఉండగానే యువకుడు వధువు పక్కన కూర్చొన్నాడు. అలా కూర్చొని ఉంటే పర్లేదు.. కానీ ఆమెకు ముద్దులు పెట్టడం కలకలం రేపింది. ఈ వీడియో వైరల్ అవుతోంది.

చూడడానికి ఫన్నీగా కనిపిస్తున్న పెళ్లికొడుకు ముఖం చూస్తుంటే జాలి కలుగుతుంది. ఎక్కడ జరిగిందో తెలియదో కానీ ఈ వీడియో మాత్రం నవ్వులు పూయిస్తుంది. రిసెప్షన్ సందర్భంగా వరుడు, వధువు స్టేజీపై కూర్చొని ఉన్నారు. ఇంతలో ఒక యువకుడు వేదిక మీదకు వచ్చి ఇద్దరి మధ్యలో కూర్చుని వధువుకు ముద్దులు పెట్టడం మొదలుపెట్టాడు. ఘటనను చూసి అక్కడున్న వారందరూ షాకయ్యారు.
ఆ వ్యక్తి తన భార్యను ఏం చేస్తున్నాడోనని పక్కనే ఉన్న వరుడు ఆసక్తిగా గమనించాడు. ఆ సమయంలో యువకుడు చర్యలకు వరుడు ముఖం పాలిపోవడం స్పష్టంగా కనిపించింది. పెళ్లికొడుకును ఏడిపించడానికే అమ్మాయి తరపు బంధువులు ఇలా ప్లాన్ చేసి ఉంటారని నెటిజన్లు భావిస్తున్నారు. ఏదేమైనా మరీ ఇంతలా దిగజారి ప్రవర్తించాలా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. నిరంజన్ మహాపాత్ర అనే వ్యక్తి ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.












Click it and Unblock the Notifications