విచిత్రం.. దిష్టిబొమ్మను పెళ్లాడిన యువకుడు... కారణమదే...

ఉత్తరప్రదేశ్‌లో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. బుధవారం(జూన్ 17) శివ మోహన్ అనే ఓ యువకుడు దిష్టిబొమ్మ మెడలో తాళి కట్టి వివాహం చేసుకున్నాడు. అతని తండ్రి కోరిక మేరకు ఈ వివాహం చేసుకోవడం గమనార్హం.

వివరాల్లోకి వెళ్తే.. లక్నోకి చెందిన శివ మోహన్ పుట్టుకతో మానసిక వికలాంగుడు. పేద కుటుంబ నేపథ్యం. 9 మంది సంతానంలో అతనే చివరి వాడు. అందరికీ వివాహలయ్యాయి. కానీ శివ మోహన్ మానసిక వికలాంగుడు కావడంతో ఎవరూ పిల్లనిచ్చేందుకు ముందుకు రాలేదు. దీంతో అతని తండ్రి విచిత్ర నిర్ణయం తీసుకున్నాడు.

'నాకు 9 మంది కొడుకులు. 8 మందికి పెళ్లిళ్లయ్యాయి. అందరికంటే చిన్నవాడైన శివమోహన్ మానసిక వికలాంగుడు. వాడికంటూ సొంతగా ఆస్తిపాస్తులు ఏమీ లేవు. ఎవరూ పిల్లనివ్వడానికి ముందుకు రాలేదు. దీంతో దిష్టిబొమ్మను పెళ్లి చేసుకోవాలని నేనే చెప్పా. ఇందుకు మోహన్ మొదట ఒప్పుకోలేదు. కానీ ఆ తర్వాత అందుకు అంగీకరించాడు.' అంటూ అతని తండ్రి వెల్లడించాడు.

తాను చనిపోక ముందే శివ మోహన్‌కు పెళ్లి కావాలన్న ఉద్దేశంతో ఇలా చేసినట్టు చెప్పాడు. చెక్కతో చేసిన ఓ బొమ్మ లాంటి ఆకారానికి చీర కట్టి,పూలు పెట్టి,అందంగా అలంకరించి శివ మోహన్‌కు దానితో పెళ్లి చేశారు. సాధారణ పెళ్లిళ్లలాగే దండలు మార్చుకుని,ఏడడుగులు అగ్ని గుండం చుట్టూ నడిచారు. స్థానిక పురోహితుడు దగ్గరుండి పెళ్లి జరిపించాడు.

man marries a wooden effigy in uttar pradesh as his fathers wish

బంధువులు,సన్నిహితులు అందరూ ఈ పెళ్లికి హాజరయ్యారు. పెళ్లి తర్వాత శివ మోహన్ తండ్రి అందరికీ మంచి విందు ఏర్పాటు చేశాడు. చాలామంది ఈ పెళ్లి గురించి తెలిసి ఆశ్చర్యపోయారు. కొన్నిచోట్ల ఇదే తరహాలో చెట్లతోనూ పెళ్లి చేసే కొన్ని ఆచార వ్యవహారాలు ఇప్పటికీ పాటిస్తుంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+