Viral Video: అదృష్టం అంటే ఇతనిదే.. వైరల్ అయిన వీడియో..
ఓ వ్యక్తి చావు నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కేరళలోని వయనాడ్ జిల్లా పుల్‌పల్లిలో ఓ ఘటన జరిగింది. బుధవారం కుంజుమాన్ అనే వ్యక్తి వర్షం కురుస్తున్న సమయంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. భారీ గాలికి అదే సమయానికి రోడ్డు పక్కన ఉన్న ఒక పెద్దచెట్టు వెళ్లతో సహా రోడ్డుపై కుప్పకూలింది.అతను చెట్టు పడడాన్ని గమనించి ముందుకు పరిగెత్తే ప్రయత్నం చేశాడు అయినా చెట్టు అతనిపై పండింది.

అతని పని అయిపోయిందనుకునేలోపే చెట్ల కొమ్మలు అతడికి రెండు వైపుల పడడం వల్ల కుంజుమాన్ కు ఎలాంటి గాయాలు కాలేదు. ఈ వీడియో అక్కడే ఓ షాపులో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియోను ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. దీని నెటిజన్లు స్పందిస్తూ అదదృష్టం అంటే కుంజుమాన్ దే అని రాసుకొచ్చారు.












Click it and Unblock the Notifications