టీవీ చూసేందుకు వచ్చి యువతిపై రేప్: 19ఏళ్ల జైలు శిక్ష

Man sentenced to 19 years’ rigorous imprisonment for raping schoolgirl
త్రిచూర్: తొమ్మిదవ తరగతి చదువుతున్నఅమ్మాయి(17)పై అత్యాచారానికి పాల్పడిన నేరానికి ఓ వ్యక్తికి 19ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ జిల్లా కోర్టు తీర్పు వెలువరించింది. డిసెంబర్ 4, 2008న నిందితుడు(46) ఆమె ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఆమెపై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ కేసులో నిందితుడికి శిక్ష విధిస్తూ కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది.

నేరం రుజువైనందున నిందితుడు వలియథిల్ చంద్రన్‌కు 19ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ. 50వేల జరిమానా విధించింది. ప్రాసిక్యూషన్ తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత అమ్మాయి తల్లి కూలీ పని నిమిత్తం బయటికి వెళ్లిన సమయంలో నిందితుడు ఆమె ఇంట్లోకి ప్రవేశించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని ఆ అమ్మాయిని నిందితుడు చంద్రన్ బెదిరింపులకు గురి చేశాడు.

బాధిత అమ్మాయి ఇంటికి వచ్చిన తన తల్లికి విషయం తెలపడంతో ఆమెను హుటాహుటాని ఆస్పత్రికి తరలించారు. పోలీసులకు బాధితురాలి తల్లి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు. పరారీలో ఉన్న నిందితుడ్ని డిసెంబర్ 28, 2008లో అరెస్ట్ చేశారు. కోర్టు తీర్పుతో అతడ్ని వియ్యూరు సెంట్రల్ జైలుకు తరలించారు.

కాగా, నిందితుడు చంద్రన్‌కు వివాహమైంది. ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. తరచూ టీవీ చూసేందుకు బాధితురాలి ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో ఆమెతో పరిచయం పెంచుకుని ఈ దారుణానికి ఒడిగట్టాడు నిందితుడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+