భార్యని, ప్రియుడ్ని కట్టేసి కొట్టిన భర్త వీడియో హల్‌చల్
న్యూఢిల్లీ: ఓ వ్యక్తి తన భార్య, ఆమె ప్రియుడిని కట్టేసి మరీ కొడుతున్న ఓ వీడియో ఇంటర్నెట్లో హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియో సరిగా ఎక్కడిదో తెలియదు. మాట తీరు, ప్రాంతాన్ని చూస్తుంటే మాత్రం ఎక్కడో ఉత్తర భారత దేశంలో జరిగినట్లుగా భావిస్తున్నారు.
ఈ వీడియోను ఓ వ్యక్తి ఫేస్‍బుక్‌లో పోస్ట్ చేశాడు. అది ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వీడియోలో... సదరు వ్యక్తి (భర్త) తన భార్యను, మరో వ్యక్తిని బాగా చితకబాదాడు. తన భార్యకు, ఆ వ్యక్తికి మధ్య అక్రమ సంబంధం ఉందని తెలియడంతో ఆయన ఇద్దరిని కలిపి కొట్టినట్లుగా తెలుస్తోంది.

తన భార్యను, ఆమె ప్రియుడిని ఓ పిల్లర్‌కు కట్టేశాడు. అందరూ చూస్తుండగానే వారిద్దరిని చితకబాదాడు. పిల్లలు, పెద్దలు అందరూ చూస్తుండగానే ఈ సంఘటన జరిగింది. వారు బాధతో విలవిలలాడిపోయారు. తట్టుకోలేక గట్టిగా అరిచిన ధ్వనులు కూడా వినిపిస్తున్నాయి.
కాగా, ఈ వీడియోను కుందన్ శ్రీవాత్సవ అనే వ్యక్తి పోస్ట్ చేశాడు. ఇది తనకు ఓ ఫాలోవర్ పంపించాడని ఆయన పేర్కొన్నాడు. ఈ వీడియో గురించి తనకు పెద్దగా ఏం తెలియదని, ఓ ఫాలోవర్ పోస్ట్ చేశాడని చెప్పాడు. ఇది వివాహేతర సంబంధం గొడవ కావొచ్చని చెప్పాడు. ఈ వీడియో యూపీ, జార్ఖండ్ లేదా బీహార్‌కు చెందింది కావొచ్చునని అభిప్రాయపడ్డాడు.












Click it and Unblock the Notifications