Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కావాలని కాదు, తెలియకే!: ట్రాన్స్‌జెండర్లకు క్షమాపణ చెప్పిన మేనకా గాంధీ

న్యూఢిల్లీ: కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకాగాంధీ ట్రాన్స్‌జెండర్లకు క్షమాపణలు చెప్పారు. ఇటీవల ఆమె లోక్‌సభలో మానవ అక్రమ రవాణా అరికట్టే విషయంపై మాట్లాడుతూ.. ట్రాన్స్‌జెండర్లను 'ది అదర్‌ వన్స్‌(ఇతరులు)' అని వ్యాఖ్యానించారు. దీంతో తోటి ఎంపీలు కొందరు నవ్వారు. దీనిపై ట్రాన్స్‌జెండర్‌ వర్గాలు ఆగ్రహం వ్యక్తంచేశాయి.

ఈ నేపథ్యంలో తమను అవమాన పరిచేలా మాట్లాడారని ఆమె క్షమాపణలు చెప్పాలని ఆ సంఘానికి చెందిన మీరా సంఘమిత్ర డిమాండ్‌ చేశారు. అంతేగాక, మేనకాగాంధీతో పాటు సభలో నవ్విన ఎంపీలంతా కూడా క్షమాపణలు చెప్పాలని కోరారు.

Maneka Gandhi apologises for calling transgenders the ‘other ones’

ఈ నేపథ్యంలో స్పందించిన మేనకా గాంధీ.. తాను కావాలని అలా అనలేదని చెప్పారు. ట్రాన్స్‌జెండర్లను అధికారికంగా ఏమనాలో తనకు అవగాహన లేకపోవడం చాలా ఇబ్బందికరంగా అనిపిస్తోందని ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. మానవ అక్రమరవాణా వ్యతిరేక బిల్లు 2018 లింగ తటస్థంగా ఉంటుందని, అందరికీ రక్షణ కల్పిస్తుందని మేనక హామీ ఇచ్చారు.

'మానవ అక్రమ రవాణా బిల్లు 2018పై చర్చ సమయంలో లోక్‌సభలో 'అదర్‌ వన్స్‌' అనే పదం వాడినందుకు మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నాను. నేను నవ్వలేదు. ట్రాన్స్‌జెండర్‌ కమ్యూనిటీని అధికారికంగా ఏమంటారో నాకు తెలియదు. ఇక మీదట అలాంటి తప్పు జరగదు. అధికారిక సంభాషణల్లో ఎప్పుడైనా ట్రాన్స్‌జెండర్స్‌కు 'టీజీస్'‌ అనే పదం వాడతాను' అని మేనక గాంధీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+