ఎంత గొప్ప మనసమ్మ నీది: కోతి కోసం కారు పంపిన మేనకా గాంధీ
న్యూఢిల్లీ: మాజీ కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీ మేనకా గాంధీ తన గొప్ప మనసును చాటుకున్నారు. రోడ్డుపక్కన గాయపడి కదలలేని స్థితిలో ఉన్న ఓ కోతి పరిస్థితిని చూసి ఆమె చలించిపోయారు. ఆ కోతికి వెంటనే చికిత్స అందించాలంటూ తన కారును పంపించారు.

రోడ్డుపక్కన గాయపడిన కోతి..
దేశ రాజధాని ఢిల్లీలోని రైసినా రోడ్డులో ప్రెస్‌క్లబ్ ఆఫ్ ఇండియా వద్ద ఫుట్ పాత్‌పై ఓ కోతి గాయాలపాలై కదలలేని స్థితిలో ఉంది. ఆ కోతి ఫొటోను ఓ జర్నలిస్టు ఫొటో తీసి ట్విట్టర్‌లో పోస్టు చేస్తూ మేనకా గాంధీని ట్యాగ్ చేశారు.
కాపాడండి అంటూ..
‘ఈ ఫొటోలో ఉన్న కోతి గాయపడి కదలలేని స్థితిలో ఉంది. ఏదైనా ఎన్జీవో గానీ, జంతు హక్కుల కార్యర్తలు గానీ ముందుకు వచ్చి కాపాడండి'అని మేనకా గాంధీని ట్యాగ్ చేస్తూ వ్యాఖ్యానించారు.
వెంటనే కారును పంపిన మేనకా గాంధీ..
జర్నలిస్టు ట్వీట్‌కు వెంటనే స్పందించిన మేనకా గాంధీ.. తక్షణమే తాను కారును పంపించారు. తనను ట్యాగ్ చేసినందుకు ఆ జర్నలిస్టుకు ధన్యవాదాలు కూడా తెలిపారామె. ఆ కోతికి సంజయ్ గాంధీ జంతు సంరక్షణ కేంద్రంలో తగిని చికిత్స అందిస్తారు అని ఆమె సమాధానమిచ్చారు.
మేనకా గాంధీపై నెటిజన్ల ప్రశంసలు
కొన్ని క్షణాల్లోనే కారు అక్కడకు చేరుకుంటుందని ఆమె తెలిపారు. ఆమె చెప్పినట్లు చేశారు కూడా. ఆ తర్వాత కొద్ది సేపటికే గాయపడిన కోతిని తీసుకెళ్లారని సదరు జర్నలిస్టు మరో ట్వీట్‌లో వెల్లడించారు. ఆ జర్నలిస్టుతోపాటు మేనకా గాంధీ చేసిన పనికి నెటిజన్లు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. గొప్ప మనసు చాటుకున్నవంటూ కొనియాడుతున్నారు. కోతి పరిస్థితిని ఎంపీ దృష్టికి తీసుకొచ్చినందుకు సదరు జర్నలిస్టు భారతీ జైన్‌ను కూడా నెటిజన్లు అభినందిస్తున్నారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications