హర్యానా సీఎంగా రెండవసారి ప్రమాణస్వీకారం చేసిన మనోహర్ లాల్ ఖత్తర్
మనోహర్ లాల్ ఖత్తర్ హర్యానా ముఖ్యమంత్రిగా రెండవసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత గవర్నర్ సత్యదియో నరేన్ ఆర్య ప్రమాణస్వీకారం చేయించారు.ఆయనతో పాటు ఉప బీజేపీకి మద్దతు ఇస్తున్న జెజెపీ నేత దుశ్యంత్ చౌతలా ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
వీరి ప్రమాణ స్వీకారానికి దుశ్యంత్ తండ్రి, ఇటివలే జైలు నుండి పెరోల్ పై వచ్చిన అజయ్ చౌతాలా కూడ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గోన్నారు. ఆయనతో పాటు బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి అదిత్యనాథ్, ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్రనాథ్ సింగ్ రావత్,హిమాచల్ ప్రదేశ్ సీఎం జయ్ రాం ఠాకూర్‌లతోపాటు రాష్ట్రానికి చెందిన ఇతర కేంద్రమంత్రులు పాల్గోన్నారు.

గురువారం వెలువడిన ఫలితాలతో హర్యానాలో బీజేపీ 40 స్థానాలు మాత్రమే గెలిచి మ్యాజిక్ ఫిగర్‌కు ఆరు సీట్ల దూరంలో నిలించిన విషయం తెలిసిందే... దీంతో పదిస్థానాలు ఉన్న జెజెపీ,అధికార బీజేపీకి మద్దతు తెలిపింది. ప్రస్తుతం 90 సీట్లు ఉన్న హర్యాణ రాష్ట్ర అసెంబ్లీలో అధికార పార్టీ బీజేపీ 57 మంది సభ్యుల మద్దతు లభించింది. అందులో 40 మంది బీజేపీ సభ్యులు కాగా 10 మంది జెజెపీ ఎమ్మెల్యేలు ఇతర ఇండిపెండెంట్‌లు ఉన్నారు. కాగా 2014లో బీజేపీ 47 స్థానాలను సాధించి స్వంతగా అధికారంలోకి వచ్చింది.
హర్యానాలో స్థిరమైన ప్రభుత్వం ఉండాలంటే బీజేపీకి మద్దతు ఇవ్వాలని తాము భావించినట్లు దుశ్యంత్ చౌతాలా చెప్పారు. ఇదిలా ఉంటే మనోహర్‌లాల్ ఖట్టర్‌ను బీజేపీ శాసనసభాపక్ష నేతగా సభ్యులు ఎన్నుకున్నారు. అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు తాము సిద్ధంగా ఉన్నట్లు గవర్నర్‌ను కలిసిన తర్వాత ఖట్టర్ తెలిపారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications