అక్టోబర్ లో బ్యాంకులకు సెలవులు
Bank holidays in October 2025: దసరా నవరాత్రులు ప్రారంభం కావడంతో, దేశవ్యాప్తంగా పండగ సందడి నెలకొంది. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు బ్యాంకులు, పాఠశాలలకు సుదీర్ఘ సెలవులను ప్రకటించాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ప్రాంతీయ బ్యాంకు సెలవుల జాబితాను విడుదల చేసింది. ప్రజల రోజువారీ కార్యకలాపాల్లో బ్యాంకులు ఓ భాగం అయ్యాయి. 95 శాతం మంది ప్రజలు ఏదో ఒక సందర్భంలో బ్యాంకులు, ఏటీఎం సేవలను వినియోగించుకుని ఉంటారంటూ కొన్ని సర్వేలు స్పష్టం చేస్తోన్నాయి.
సాధారణంగా మూడు కేటగిరీల్లో బ్యాంకుల హాలిడేలను ప్రకటిస్తుంటుంది రిజర్వు బ్యాంకు. ఒకటి- నెగోషియేబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్, రెండు- నెగోషియేబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ అండ్ రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ హాలిడే, మూడు- బ్యాంక్స్ క్లోసింగ్ ఆఫ్ అకౌంట్స్. ఈ మూడింట్లో మొదటి కేటగిరీ కింద సాధారణ సెలవులు వర్తింపజేస్తుంటుంది. నెగోషియేబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ కింద.. డిసెంబర్ నెల మొత్తంగా ఏడు సెలవులు ఉంటాయి బ్యాంకులకు.

ఇవి పోను- ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో.. అక్కడి ప్రజల సంప్రదాయాలు, పండుగలు, తిథులను అనుసరించి జారీ చేసే సెలవులు అదనం. ఆర్బీఐ క్యాలెండర్ ప్రకారం, అక్టోబర్ లో రెండు, నాలుగో శనివారాలు, అన్ని ఆదివారాల్లో బ్యాంకులకు సెలవులు ఉంటాయి. దుర్గాపూజ సందర్భంగా, ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌తో పాటు పండుగను ఘనంగా జరుపుకునే అనేక రాష్ట్రాలలో అదనపు సెలవులను ప్రకటించారు.
అక్టోబర్ 1: బీహార్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మేఘాలయ, నాగాలాండ్, ఒడిశా, సిక్కిం, తమిళనాడు, తెలంగాణ, త్రిపుర, పశ్చిమ బెంగాల్‌లలో మహానవమి సెలవు.
అక్టోబర్ 2: దసరా, గాంధీ జయంతి సెలవులు. ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ వంటి రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలలో గాంధీ జయంతి, దసరా జరుపుకొంటారు.
అక్టోబర్ 6: లక్ష్మీ పూజ సందర్భంగా ఒడిశా, పంజాబ్, సిక్కిం, త్రిపుర, పశ్చిమ బెంగాల్ లల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది.
అక్టోబర్ 7: మహర్షి వాల్మీకి జయంతిని పురస్కరించుకుని హర్యానా, హిమాచల్ ప్రదేశ్ కర్ణాటకల్లో సెలవు
అక్టోబర్ 20: దీపావళి (అరుణాచల్ ప్రదేశ్, అస్సాం), నరక చతుర్దశి (కర్ణాటక, కేరళ)
అక్టోబర్ 21: దీపావళి (ఏపీ, బీహార్, ఇతర రాష్ట్రాలు)
అక్టోబర్ 22: దీపావళి (హర్యానా, మహారాష్ట్ర)
అక్టోబర్ 23: భాయ్ దూజ్ (గుజరాత్, ఉత్తరప్రదేశ్)
అక్టోబర్ 24: నింగోల్ చకౌబా (మణిపూర్)
అక్టోబర్ 27-28: ఛాత్ పూజ (బీహార్)












Click it and Unblock the Notifications