Marriage: పెళ్లిలో హ్యాపీగా ఎంజాయ్ చేశారు, ఊరికి వెలుతుంటే ?, డ్రైవర్ నిర్లక్షంతో ఆరు మంది !
బెంగళూరు/ మైసూరు: బంధువుల పెళ్లికి హాజరుకావాలని పెళ్లి చేసుకుంటున్న యువతి, యువకుడి బందువులు అనుకున్నారు. అనుకున్నట్లే చాలా మంది బంధువులు రాత్రి రిసెప్షన్ కు, ఉదయం ముహూర్తానికి హాజరైనారు. పెళ్లి చేసుకుంటున్న యువతి, యువకుడికి చాలా దగ్గర బంధువులు అందరూ ఉదయం పెళ్లి ముహూర్తానికి హాజరైనారు. నవధంపతులను ఆశీర్వధించిన బంధువులు వారి సొంత ఊర్లకు కార్లలో బయలుదేరారు. పెళ్లి చాలా గ్రాండ్ గా జరిగిందని, దంపతులు చూడముచ్చటగా ఉన్నారని బంధువులు అందరూ సంతోషించారు. మార్గం మధ్యలో బోలేరో వాహనంలో వెలుతున్న బంధువులు మాకు ఇప్పుడు చావు ఎదురౌతుందని ఊహించలేకపోయారు. డ్రైవర్ నిర్లక్షంగా వాహనం నడపడంతో అతనితో పాటు ఆరు మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. పెళ్లి కూతురికి చాలా దగ్గర బంధువులు ఆరు మంది ఒకేసారి ప్రమాదంలో చనిపోవడంతో పెళ్లి ఇంట్లో విషాదచాయలు నెలకొన్నాయి.

పెళ్లికి వెళ్లాలని అనుకున్న బంధువులు
కర్ణాటకలోని మైసూరు జిల్లాలోని హణసూరులో బుధవారం పాలిబెట్టకు చెందిన సదానంద, హణసూరుకు చెందిన రమ్యా (పేరు మార్చడం జరిగింది)ల వివాహం చెయ్యాలని పెద్దలు నిర్ణయించారు. బంధువుల పెళ్లికి హాజరుకావాలని పెళ్లి చేసుకుంటున్న సదానంద, రమ్యాల బందువులు చాలా మంది డిసైడ్ అయ్యారు.

రాత్రి రిసెప్షన్.... ఉదయం ముహూర్తం
అనుకున్నట్లే చాలా మంది బంధువులు మంగళవారం రాత్రి రిసెప్షన్ కు, బుధవారం ఉదయం పదానంద, రమ్యా పెళ్లి ముహూర్తానికి హాజరైనారు. నవదంపతులు సదానంద, రమ్యాను ఆశీర్వధించిన బంధువులు వారి సొంత ఊర్లకు కార్లలో బయలుదేరారు. పెళ్లి చాలా గ్రాండ్ గా జరిగిందని, దంపతులు చూడముచ్చటగా ఉన్నారని బంధువులు అందరూ సంతోషించారు.

ఒకే కారులో ఉన్న ఆరు మంది దుర్మరణం
మార్గం మధ్యలో హణసూరు సమీపంలో బోలేరో వాహనంలో వెలుతున్న బంధువులు మాకు ఇప్పుడు చావు ఎదురౌతుందని ఊహించలేకపోయారు. బోలెరో వాహనం డ్రైవర్ నిర్లక్షంగా వాహనం నపడడంతో ఆ వాహనం చెట్టును ఢీకొనింది. డ్రైవర్ తో పాటు కారులో ఉన్న అనీల్, బాబు, రాజేష్ దయానంద్, వినిత్, కీర్తనా, ఏంజిల్ తో పాటు కారు డ్రైవర్ సంతోష్ దుర్మరణం చెందారు. కారు డ్రైవర్ సంతోష్ తో పాటు ఆరు మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. పెళ్లి కూతురికి చాలా దగ్గర బంధువులు ఆరు మంది ఒకేసారి ప్రమాదంలో చనిపోవడంతో పెళ్లి ఇంట్లో విషాదచాయలు నెలకొన్నాయి.












Click it and Unblock the Notifications