Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Marriage: వధూవరులకు గిఫ్ట్ లు ఇస్తున్న బంధువులు, రసగుల్లా ఎంతపని చేసింది, రణబీర్ సింగ్ ?

వివాహ రిసెప్షన్‌లో రసగుల్లా కోసం గొడవ జరిగి వధువు బంధువు మీద ఇద్దరు దాడి చేశారు. తరువాత వధువు, వరుడి బంధువులు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్నారు. రణబీర్ సింగ్ మీద అందరూ ?.

లక్నో/ఉత్తరప్రదేశ్: వివాహ రిసెప్షన్‌లో రసగుల్లా కోసం గొడవ జరిగింది. మొదట వధువు బంధువు మీద ఇద్దరు దాడి చేశారు. తరువాత వధువు, వరుడి బంధువులు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుకున్నారు. రిసెప్షన్ లో రసగుల్లా కోసం జరిగిన గొడవ కారణంగా వధువు సమీప బంధువు హత్యకు గురికావడం కలకలం రేపింది. వధువు, వరుడి బంధువుల మధ్య గొడవ జరగడం, వధువు బంధువు మృతి చెందగా, వధువు తల్లి తమ్ముడికి తీవ్రంగా గాయాలైనాయి. రసగుల్లా బకెట్‌ను దొంగిలించిన వధువు బంధువును వరుడి తరపు వారు కొట్టారని పోలీసులు చెబుతున్నారు. అప్పటికే దండలు మార్చుకుని గిఫ్ట్ లు కూడా అందుకున్న యువతి, యువకుడి పెళ్లి అటకెక్కింది.

పెళ్లికి వెళ్లిన బంధువులు

పెళ్లికి వెళ్లిన బంధువులు

ఉత్తరప్రదేశ్ లోని మైన్ పురి జిల్లాలోని కురావలి సమీపంలోని బికాపుర గ్రామంలో యువతి, యువకుడి పెళ్లికి ఏర్పాటు చేశారు. రాత్రి పెళ్లి రిసెప్షన్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. వధువు, వరుడి కుటుంబ సభ్యులతో పాటు ఇతర ప్రాంతాల్లో బంధువులు పెద్ద సంఖ్యలో పెళ్లికి హాజరైనారు. వేదిక మీద పెళ్లికొడుకు. పెళ్లికూతురు నిలబడి బంధువులకు స్వాగం పలికి వాళ్లు తెచ్చిన గిఫ్ట్ లు తీసుకుంటున్నారు.

భోజనాలు చేస్తున్న బంధువులు

భోజనాలు చేస్తున్న బంధువులు

వరుడు, వధువుకు బహుమతులు ఇచ్చిన కొందరు బంధువులు భోజనాలు చెయ్యడానికి వెళ్లారు. ఇదే పెళ్లికి పెళ్లికూతురికి అతి సమీప బంధువు అయిన హర్యానా నివాసి రణబీర్ సింగ్ (50), ఆయన కుటుంబ సభ్యులు హాజరైనారు. పెళ్లికి వెళ్లిన వారికి వంటలు చేసిన చోట స్వీట్లు, పలావ్, కుర్మ తదితర వంటకాలు ఉన్నాయి. ఇక్కడే రసగుల్లా చేసిన పెద్ద అండా కూడా ఉంది. వివిద రకాల వంటలు చేసి వాటిని బకెట్లలో వేసి బోజనాలు చేస్తున్న బంధువులు, గెస్ట్ లకు వడ్డిస్తున్నారు.

రసగుల్లా బకెట్ ఎత్తుకున్నాడని ?

రసగుల్లా బకెట్ ఎత్తుకున్నాడని ?

పెళ్లికూతురి బంధువు రణబీర్ సింగ్ వారికి కావలసినవారికి రెండోసారి రసగుల్లా వడ్డించడానికి రసగుల్లాలు వేసి బక్కెట్ ఎత్తుకు అక్కడి నుంచి బంతి దగ్గరకు బయలుదేరాడు. రసగుల్లా బకెట్ చోరీ చేస్తున్నాడని ఆరోపిస్తూ రజత్, జయ్, సత్యభాన్, భరత్ తదితరులు రణబీర్ సింగ్ ను పట్టుకుని అతని నుంచి వివరణ కూడా అడగకుండా చితకబాదేశారు. రసగుల్లా ఉన్న బకెట్లతోనే రణబీర్ సింగ్ మీద దాడి చేశారు. తీవ్రగాయాలైన రణబీర్ సింగ్ కుప్పకూలిపోయాడు.

పెళ్లి ఆగిపోయింది

పెళ్లి ఆగిపోయింది

వధువు, వరుడి బంధువులు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుకున్నారు. రిసెప్షన్ లో రసగుల్లా కోసం జరిగిన గొడవ కారణంగా వధువు సమీప బంధువు రణబీర్ సింగ్ హత్యకు గురికావడం కలకలం రేపింది. వధువు, వరుడి బంధువుల మధ్య గొడవ జరగడం, వధువు బంధువు రణబీర్ సింగ్ హత్యకు గురి అయ్యాడు. వధువు తల్లి తమ్ముడికి తీవ్రంగా గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. రసగుల్లా బకెట్‌ను దొంగిలించిన వధువు బంధువును వరుడి తరపు వారు కొట్టారని పోలీసులు చెబుతున్నారు.

రసగుల్లా ఎంతపని చేసింది

రసగుల్లా ఎంతపని చేసింది

రణబీర్ సింగ్ హత్య కేసులో రజత్, జయ్, సత్యభాన్, భరత్ లను అరెస్టు చేశామని, ఇంకా కొందరు తప్పించుకున్నారని పోలీసులు అంటున్నారు. అప్పటికే దండలు మార్చుకుని గిఫ్ట్ లు కూడా అందుకున్న యువతి, యువకుడి పెళ్లి అటకెక్కింది. రణబీర్ సింగ్ హత్య కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు అన్నారు. కొన్ని నెలల క్రితం ఇదే ఉత్తరప్రదేశ్ లో రసగుల్లాలు వడ్డించలేదని పెళ్లిలో జరిగిన గొడవలో ఓ వ్యక్తి హత్యకు గురైనాడు. ఇప్పుడు మరోసారి రసగుల్లా కోసం మరో హత్య జరగడం కలకలం రేపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+