షాక్: వధువు హై హీల్స్ వేసుకొన్నందుకు పెళ్ళిరద్దు చేసుకొన్నారు
ఎత్తు చెప్పుల కారణంగా ఏకంగా వివాహమే రద్దైంది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకొంది. హైహీల్స్ కారణంగా వధువు నడక సక్రమంగా లేదంటూ ప్రదీప్ అనే వరుడు వివాహాన్ని రద్దు చేసుకొన్నారు.
బెంగుళూరు: ఎత్తు చెప్పుల కారణంగా ఏకంగా వివాహమే రద్దైంది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకొంది. హైహీల్స్ కారణంగా వధువు నడక సక్రమంగా లేదంటూ ప్రదీప్ అనే వరుడు వివాహాన్ని రద్దు చేసుకొన్నారు.
వధువు కాస్తంత పొట్టిగా ఉందనే కారణంగా పుట్టింటివారు ఆమెకు ఎత్తుగా ఉండే చెప్పులు వేశారు. బుదవారం సాయంత్రం రిసెప్షన్ సమయంలో వాటిని తొడుక్కొని నడుస్తూ ఆమె కిందపడిపోయింది.
దీంతో వరుడి తరుపువారు ఆమెతో గొడవకు దిగారు. వధువుకు మూర్చవ్యాధి ఉందంటూ వాదించారు. వధువు తరుపువారు ఎంత చెప్పినా వరుడు కుటుంబసభ్యులు పట్టించుకోలేదు.

వరుడు కుటుంబసభ్యులు ససేమిరా అన్నారు. అవసరమైతే వివాహన్ని రద్దు చేసుకొంటామని తేల్చేశారు. బిడది సమీపంలోని ఓ ప్రైవేట్ సంస్థలో వరుడు ఉద్యోగం చేస్తున్నాడు. కుణిగల్ తాలుకా హోసదొడ్డి గ్రామానికి చెందిన ప్రదీప్ కు ఓ యువతితో వివాహం నిశ్చయమైంది.
బుదవారం నాడు రిసెప్షన్, గురువారం నాడు వివాహం చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. వివాహాన్ని రామనగర పట్టణంలోని కృష్ణస్మృతి కళ్యాణమండపంలో జరిగేలా తీర్మాణించారు.అయితే వధువు కిందపడిపోవడంతో మూర్ఛవ్యాధి ఉందంటూ పెళ్ళిని రద్దు చేసుకొన్నారు వరుడి కుటుంబసభ్యులు
-
IPL మ్యాచ్లకు ఉచితంగా 3 టికెట్లు - కండీషన్స్ అప్లై..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట!












Click it and Unblock the Notifications