Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Marriage: పెళ్లి రిసెప్షన్ లో కుప్పకూలిన పెళ్లి కూతురు. బ్రెయిన్ డెడ్,పెళ్లి కూతురి అవయవాలు దానం !

బెంగళూరు: బాగా చదువుకున్న యువతికి పెళ్లి చెయ్యాలని ఆమె కుటుంబ సభ్యులు చాలా పెళ్లి సంబంధాలు చూశారు. చివరికి అమ్మాయికి అబ్బాయి నచ్చడం, అబ్బాయికి అమ్మాయి నచ్చడంతో పెళ్లి ఫిక్స్ అయ్యింది. కూతురి పెళ్లి జరుగుతోందని అమ్మాయి కుటుంబ సభ్యులు సంతోషించారు. తాను పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభిస్తానని అమ్మాయి కలలు కనింది. పెళ్లి డేట్ ఫిక్స్ అయ్యింది. పెళ్లికి బంధువులు, స్నేహితులు అందరూ హాజరైనారు. పెళ్లి రిసెప్షన్ గ్రాండ్ గా ఏర్పాటు చేశారు. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు వాళ్లను ఆశీర్వదించడానికి వెళ్లిన బంధువులు, స్నేహితులతో ఉల్లాసంగా గడుపుతున్నారు. రిసెప్షన్ జరుగుతున్న సమయంలోనే వేదిక మీద పెళ్లి కూతురు కుప్పకూలిపోయింది. వెంటనే స్థానిక ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేయించిన కుటంబ సభ్యులు ఆమెను నిమ్హాన్స్ ఆసుపత్రికి తరలించారు. పెళ్లి కూతురికి బ్రైన్ డెడ్ అయ్యిందని వైద్యులు చెప్పడంతో ఆమె కుటుంబ సభ్యులతో పాటు పెళ్లి కొడుకు షాక్ అయ్యారు. పెళ్లి చేసుకుని అత్తారింటిలో అడుగు పెట్టాల్సిన పెళ్లి కూతురి అవయవాలు అన్ని దానం చేసిన కుటుంబ సభ్యులు కొందరికి ప్రాణం పోశారు. పెళ్లి కూతురికి బ్రైన్ డెడ్ కావడంతో ఆమె అవయవాలు మొత్తం దానం చేశారని, ఆమె సజీవంగానే ఉన్నారని ఆరోగ్య శాఖా మంత్రి స్వయంగా ట్విట్ చేశారు.

 అమ్మాయికి పెళ్లి సంబంధం ఓకే

అమ్మాయికి పెళ్లి సంబంధం ఓకే

కర్ణాటకలోని కోలారు జిల్లాలోని శ్రీనివాసపురంలో (ఆంధ్రప్రదేశ్ లోని మదనపల్లి సరిహద్దు) చైత్రా (26) అనే యువతి నివాసం ఉంటున్నది. బాగా చదువుకున్న చైత్రాకు పెళ్లి చెయ్యాలని ఆమె కుటుంబ సభ్యులు చాలా పెళ్లి సంబంధాలు చూశారు. చివరికి చైత్రాకు ఓ అబ్బాయి నచ్చడం, అబ్బాయికి ఆ అమ్మాయి నచ్చడంతో పెళ్లి ఫిక్స్ అయ్యింది.

 గ్రాండ్ గా రిసెప్షన్

గ్రాండ్ గా రిసెప్షన్

కూతురి పెళ్లి జరుగుతోందని చైత్రా కుటుంబ సభ్యులు సంతోషించారు. తాను పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభిస్తున్నానని పెళ్లి కూతురు చైత్రా చాలా కలలు కనింది. పెళ్లి డేట్ ఫిక్స్ అయ్యింది. పెళ్లికి బంధువులు, స్నేహితులు అందరూ హాజరైనారు. శ్రీనివాసపురం పట్టణంలోని కల్యాణ మండపంలో చైత్రా పెళ్లి రిసెప్షన్ గ్రాండ్ గా ఏర్పాటు చేశారు.

 కుప్పకూలిపోయిన పెళ్లి కూతురు

కుప్పకూలిపోయిన పెళ్లి కూతురు

పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు చైత్రాను ఆశీర్వదించడానికి వెళ్లిన బంధువులు, స్నేహితులతో ఉల్లాసంగా గడుపుతున్నారు. రిసెప్షన్ జరుగుతున్న సమయంలోనే వేదిక మీద పెళ్లి కొడుకుతో పాటు నిలబడి ఉన్న పెళ్లి కూతురు చైత్రా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు, బంధువులు వెంటనే చైత్రాకు నీళ్లు తాగించడానికి ప్రయత్నించారు.

 బెంగళూరు నిమ్హాన్స్ ఆసుపత్రి

బెంగళూరు నిమ్హాన్స్ ఆసుపత్రి

వెంటనే శ్రీనివాసపురంలోని స్థానిక ఆసుపత్రిలో పెళ్లి కూతురు చైత్రాకు ప్రథమ చికిత్స చేయించిన కుటంబ సభ్యులు ఆమెను బెంగళూరులోని నిమ్హాన్స్ ఆసుపత్రికి తరలించారు. పెళ్లి కూతురు చైత్రాకు బ్రైన్ డెడ్ అయ్యిందని వైద్యులు చెప్పడంతో ఆమె కుటుంబ సభ్యులతో పాటు పెళ్లి కొడుకు షాక్ అయ్యారు.

Recommended Video

    Special Interview With TDP Senior Leader Katragadda Prasuna | Oneindia Telugu
     పెళ్లి కూతురి అవయవాలు దానం

    పెళ్లి కూతురి అవయవాలు దానం

    పెళ్లి చేసుకుని అత్తారింటిలో అడుగు పెట్టాల్సిన పెళ్లి కూతురు చైత్రా అవయవాలు అన్ని దానం చెయ్యాలని ఆమె కుటుంబ సభ్యులు నిర్ణయించారు. చైత్రా అవయవాలు దానం చేసిన ఆమె కుటుంబ సభ్యులు కొందరికి ప్రాణం పోశారు. పెళ్లి కూతురు చైత్రా బ్రైన్ డెడ్ కావడంతో ఆమె అవయవాలు మొత్తం దానం చేశారని, ఆమె సజీవంగానే ఉన్నారని కర్ణాటక ఆరోగ్య శాఖా మంత్రి డాక్టర్ సుధాకర్ శనివారం స్వయంగా ట్విట్ చేశారు. పెళ్లి కూతురు చైత్రా బ్రైన్ డెడ్ కావడం, ఆమె పెళ్లి ఆగిపోవడంతో ఆమె కుటుంబంతో పాటు పెళ్లి కొడుకు కుటుంబంలో విషాదచాయలు నెలకొన్నాయి.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+