Marriage: వారం క్రితం గ్రాండ్ గా పెళ్లి, విదేశాల్లో భర్త ఉద్యోగం, అర్దరాత్రి భర్తకు షాక్, జంప్ !

చెన్నై/తంజావూర్: విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న యువకుడికి పెళ్లి చెయ్యాలని అతని కుటుంబ సభ్యులు అనుకున్నారు. తెలిసినవాళ్లు ఓ యువతి గురించి చెప్పడంతో ఆమె కుటుంబ సభ్యులతో అబ్బాయి కుటుంబ సభ్యులు మాట్లాడారు. యువతిని పెళ్లి చేసుకోవడానికి విదేశాల్లో ఉన్న యువకుడు గ్రీన్ సింగ్నల్ ఇచ్చాడు. వారం రోజుల క్రితం పెళ్లి గ్రాండ్ గా జరిగింది. రాత్రి దంపతులు వారి బెడ్ రూమ్ లో ఉన్నారు. అర్దరాత్రి వరకు భార్యతో ఆమె భర్త మాట్లాడాడు. వేకువ జామున మెలుకువ రావడంతో భర్త నిద్రలేచి చూశాడు. బెడ్ రూమ్ లో భార్య లేకపోవడంతో బయటకు వచ్చి ఇల్లు మొత్తం చూశాడు. భార్య ఎక్కడా కనపడలేదు. దంపతులు రాత్రి ఉన్న బెడ్ రూమ్ లో పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులు చేయించిన తాళి కనపడటంతో పెళ్లికొడుకు షాక్ అయ్యాడు. కొత్తపెళ్లికూతురు చేసిన పనికి పెళ్లికొడుకుతో పాటు అతని కుటుంబ సభ్యులు బిత్తరపోయారు.

 విదేశాల్లో ఉద్యోగం

విదేశాల్లో ఉద్యోగం

తమిళనాడులోని తంజావూర్ కు చెందిన రమేష్ రాజ్ (పేరు మార్చడం జరిగింది) విదేశాల్లో మంచి ఉద్యోగం చేస్తున్నాడు. లక్షల్లో జీతం తీసుకుంటున్న రమేష్ రాజ్ కు పెళ్లి చెయ్యాలని అతని కుటుంబ సభ్యులు అనుకున్నారు. తెలిసినవాళ్లు తంజావూర్ కు చెందిన రవలి రమ్యా (పేరు మార్చడం జరిగింది) అనే యువతి గురించి చెప్పడంతో ఆమె కుటుంబ సభ్యులతో రమేష్ రాజ్ కుటుంబ సభ్యులు మాట్లాడారు.

 వారం క్రితం గ్రాండ్ గా పెళ్లి

వారం క్రితం గ్రాండ్ గా పెళ్లి

రవలి రమ్యాను పెళ్లి చేసుకోవడానికి విదేశాల్లో ఉన్న రమేష్ రాజ్ గ్రీన్ సింగ్నల్ ఇచ్చాడు. వారం రోజుల క్రితం రమేష్ రాజ్, రవలి రమ్యాల పెళ్లి గ్రాండ్ గా జరిగింది. వారం రోజుల్లోనే కొత్త దంపతులు కొందరు బంధువుల ఇళ్లకు వెళ్లి వచ్చారు. రాత్రి కొత్త పెళ్లి కొడుకు రమేష్ రాజ్ ఇంట్లోనే కొత్త పెళ్లి కూతురు ఉంది.

 వేకువ జామన భర్తకు షాక్

వేకువ జామన భర్తకు షాక్

రాత్రి రమేష్ రాజ్, రవలి రమ్యా దంపతులు వారి బెడ్ రూమ్ లో ఉన్నారు. అర్దరాత్రి వరకు భార్య రవలి రమ్యాతో ఆమె భర్త రమేష్ రాజ్ మాట్లాడాడు. వేకువ జామున మెలుకువ రావడంతో రమేష్ రాజ్ నిద్రలేచి చూశాడు. బెడ్ రూమ్ లో భార్య రవలి రమ్యా కనపడకపోవడంతో రూమ్ లో నుంచి బయటకు వచ్చి ఇల్లు మొత్తం చూశాడు. భార్య రవలి రమ్యా ఎక్కడా కనపడలేదు.

 ఇంట్లో తాళి వదిలేసి వెళ్లిపోయిన కొత్తపెళ్లి కూతురు

ఇంట్లో తాళి వదిలేసి వెళ్లిపోయిన కొత్తపెళ్లి కూతురు

రమేష్ రాజ్, రవలి రమ్యా దంపతులు రాత్రి ఉన్న బెడ్ రూమ్ లో పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులు చేయించిన తాళి కనపడటంతో పెళ్లికొడుకు షాక్ అయ్యాడు. నా భార్య కనపడటం లేదని కొత్త పెళ్లి కొడుకు తంజావూరులోని ఒడటనాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి.

 ప్రియుడితో కొత్త పెళ్లి కూతురు జంప్

ప్రియుడితో కొత్త పెళ్లి కూతురు జంప్

కొత్త పెళ్లి కూతురికి పెళ్లికి ముందే భాయ్ ఫ్రెండ్ ఉన్నాడని, పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని ముందే చెప్పినా ఆమె కుటుంబ సభ్యులు బలవంతంగా పెళ్లి చేశారని, చివరికి భర్తను వదిలేసి తాళి తీసి పారేసి ప్రియుడితో కొత్త పెళ్లి కూతురు పారిపోయిందని పోలీసులు అన్నారు. కొత్తపెళ్లికూతురు చేసిన పనికి పెళ్లికొడుకుతో పాటు అతని కుటుంబ సభ్యులు బిత్తరపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+