Constable: అర్దరాత్రి ఫోన్ చేసి నువ్వు కత్తి, నాటుకోడి, నా కోరిక తీర్చు అని కవితలు చెప్పిన హెడ్ కానీస్టేబుల్ !
బెంగళూరు/ హోస్ పేటే: వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో కాపురం చేస్తోంది. మహిళ ఆమె బంధువులకు ఆర్థిక సహాయం చేస్తోంది. డబ్బులు తీసుకున్న చిన్నాన కూతురు డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో గొడవ జరిగింది. మహిళ పోలీస్ స్టేషన్ కు వెళ్లి చిన్నాన కూతురు మీద కేసు పెట్టింది. కేసు నమోదు చేసిన పోలీసులు మీరు మరుసటి రోజు వస్తే అందరిని పిలిపించి పంచాయితీ చేస్తామని చెప్పారు. మరుసటి రోజు మహిళకు ఫోన్ చేసిన హెడ్ కానీస్టేబుల్ చూడటానికి నువ్వు కత్తిలా, నాటుకోడిలా ఉన్నావు, రాత్రికి నా కోరిక తీరిస్తే నీ కేసును గంటలో పరిష్కారం చేస్తానని ఆమెకు చెప్పారు. రాత్రి నాలుగైదుసార్లు ఆమెకు ఫోన్ చేసిన హోడ్ కానీస్టేబుల్ అతనిలో కామాన్ని కవితల రూపంలో ఆమెకు చెప్పడంతో అక్కడ అసలు కథ మొదలైయ్యింది.

డబ్బుల విషయంలో చెల్లితో గొడవ
కర్ణాటకలోని హోస్ పేట్ జిల్లాలోని కోట్టూరు ప్రాంతంలో సరిత (పేరు మార్చడం జరిగింది) అనే మహిళ నివాసం ఉంటున్నది. వివాహం చేసుకున్న సరిత ఆమె భర్తతో కాపురం చేస్తోంది. సరిత ఆమె బంధువులకు ఆర్థిక సహాయం చేస్తోంది. డబ్బు తీసుకున్న చిన్నాన కూతురు డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో సరిత ఆమెతో గొడవపడింది.

చిన్నాన కూతురి మీద కేసు
సరితకు, ఆమె చిన్నాన కూతురికి నచ్చచెప్పడానికి ప్రయత్నించిన బంధువులు రాజీ చెయ్యడానికి ప్రయత్నించారు. అయితే సరితో పాటు ఆమె చిన్నాన కూతురు ఎవ్వరిమాట వినలేదని తెలిసింది. సరిత కోట్టూరు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఆమె చిన్నాన కూతురు మీద కేసు పెట్టింది. కేసు నమోదు చేసిన పోలీసులు మీరు మరుసటి రోజు వస్తే అందరిని పిలిపించి పంచాయితీ చేస్తామని సరితకు చెప్పారు.

రాత్రి ఫోన్ చేసి రాసలీలల గురించి మాట్లాడిన పోలీసు
కోట్టూరు పోలీస్ స్టేషన్ లో మారప్ప హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు. సరిత కేసు పెట్టిన సమయంలో హెడ్ కానిస్టేబుల్ మారప్ప లిఖితపూర్వకంగా కేసు రాసుకున్నాడు. మరుసటి రోజు సరితకు ఫోన్ చేసిన హోడ్ కానీస్టేబుల్ మారప్ప ఆమెతో కేసు విషయం మాట్లాడకుండా రాసలీలల గురించి మాట్లాడాడు.

కత్తిలా, నాటుకోడిలా ఉన్నావు.... కామంతో కవితలు
నువ్వు చూడటానికి నువ్వు కత్తిలా, నాటుకోడిలా ఉన్నావు, రాత్రికి నా కోరిక తీరిస్తే నీ కేసును గంటలో పరిష్కారం చేస్తానని హెడ్ కానీస్టేబుల మారప్ప కేసు పెట్టిన సరితకు చెప్పాడు. రాత్రి నాలుగైదుసార్లు ఆమెకు ఫోన్ చేసిన హెడ్ కానీస్టేబుల్ మారప్ప అతనిలో కామాన్ని కవితల రూపంలో ఆమెకు చెప్పడంతో ఆమె హడలిపోయింది.

ఉద్యోగం ఊడింది..... జైల్లో కవిరాజు
బాధితురాలు ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదు చేసిన సీనియర్ పోలీసుల అధికారులు మహిళ మొబైల్ ఫోన్ లో రికార్డు అయిన వాయిస్ విన్నారు. హెడ్ కానీస్టేబుల్ మారప్పను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసి అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచామని హోస్ పేటే జిల్లా ఎస్పీ డాక్టర్ అరుణ్ మీడియాకు చెప్పారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications