మతం దాచిపెట్టి పెళ్లి చేసుకుంటే పదేళ్ళు జైలుకే
మన సమాజంలో కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే మతాంతర వివాహాల పైన హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మతాన్ని దాచిపెట్టి పెళ్లి చేసుకునే వారిపైన మతమార్పిడుల నిరోధక చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆ ప్రభుత్వం నిర్ణయించింది. హర్యానా ప్రభుత్వం ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు, ఎస్పీలకు కీలక ఆదేశాలను కూడా ఇచ్చింది.
మతమార్పిడులపై హర్యానా సర్కార్ నిర్ణయం
పెళ్లి కోసం జరిగే మత మార్పిడులను ఈ చట్టం అడ్డుకుంటుందని పేర్కొంది. ఇక ఎవరైనా ఈ చట్టాన్ని అతిక్రమిస్తే సుమారు నాలుగు లక్షల రూపాయల దాకా జరిమానా తో పాటు 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉందని హర్యానా ప్రభుత్వం పేర్కొంది. మతమార్పిడుల నిరోధక చట్టం 2022ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించిన క్రమంలో తాజాగా హర్యానా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపైన రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతుంది.

అలా మత మార్పిడులు చెల్లవు
ఎవరైనా మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాలి అనుకుంటే చట్టప్రకారం మతమార్పిడికి సంబంధిత వ్యక్తులు అధికారులకు దరఖాస్తు చేసుకుని, నిర్ణీత గడుపు దాకా నిరీక్షించాల్సి ఉంటుంది. చట్టప్రకారం మత మార్పిడి జరిగితేనే తర్వాత పెళ్లి చేసుకోవచ్చు . అలా కాకుండా బలవంతంగా, మోసపూరితంగా జరిగే మతమార్పిడులు ఎట్టి పరిస్థితిలోనూ అంగీకరించబోమని హర్యానా ప్రభుత్వం వెల్లడించింది.
హర్యానా సర్కార్ నిర్ణయం వెనుక ఉద్దేశం ఇదే
అటువంటి మతమార్పిడి లను రద్దు చేస్తామని ప్రకటించింది. వ్యక్తుల యొక్క మత స్వేచ్చను అడ్డుకోవడం తమ ఉద్దేశం కాదని పేర్కొన్న హర్యానా సర్కార్ ఆ పేరుతో జరిగే చట్ట వ్యతిరేక కార్యకలాపాలను నిరోధించడమే తమ లక్ష్యమని వెల్లడించింది. ఇటీవల కాలంలో మతాన్ని దాచిపెట్టి పెళ్లి చేసుకొని ఆపై మతమార్పిడులకు పాల్పడుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పలువురు కొనియాడుతున్నారు.
అన్ని రాష్ట్రాల్లో ఇదే విధానం తెస్తే మంచిది
మతం దాచిపెట్టి పెళ్లి చేసుకుంటే పదేళ్లు జైలు శిక్ష విధిస్తామని, కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పడం ఒక మంచి చర్య అని అభిప్రాయపడుతున్నారు. ఇదే తరహాలో ఇతర రాష్ట్రాలలో కూడా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటే మంచిదని చెబుతున్నారు
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications