Earthquake : నేపాల్లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం-వణికిన ఢిల్లీ వాసులు..

నేపాల్లో ఇవాళ భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం ధాటికి నేపాల్ వణికింది. దీని ప్రభావం మన దేశ రాజధాని ఢిల్లీపైనా పడింది. దీంతో ఢిల్లీలోనూ భారీ ప్రకంపనలు వచ్చాయి. కాసేపు ఢిల్లీ వాసులు కంగారు పడ్డారు. ఇళ్లలో నుంచి బయటికి పరుగులు తీశారు. నేపాల్లో వచ్చిన భూకంపం కారణంగా ఈ ప్రకంపనలు వచ్చినట్లు తెలుసుకుని ఆ తర్వాత ఊపిరిపీల్చుకున్నారు.

పొరుగున ఉన్న నేపాల్‌లో ఈరోజు 6.2 తీవ్రతతో భూకంపం సంభవించిన తర్వాత ఢిల్లీలో భారీ ప్రకంపనలు సంభవించాయి.నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ భూకంప కేంద్రం నేపాల్‌లో ఉన్నట్లు గుర్తించింది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.51కి ఈ భూకంపం వచ్చినట్లు గుర్తించింది. భూకంపం ప్రభావంతో జనం కాసేపు భయపడినా ఎలాంటి నష్టం లేకపోవడంతో అధికారులు కూడా ఊపిరిపీల్చుకున్నారు.

massive treamours in delhi after nepal earthquake with 6.2 magnitude

ఈ భూకంపం కారణంగా 40 సెకన్ల పాటు ప్రకంపనలు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఢిల్లీలో ప్రకంపనలు రావడంతో పోలీసులు సోషల్ మీడియాలో దీనిపై స్పందించారు. జనం ఇళ్లలో నుంచి బయటికి వచ్చి సురక్షిత ప్రదేశాలకు చేరుకోవాలని, మాల్స్ లో, ఇతర ఆఫీసుల్లో ఎలివేటర్లు వాడొద్దని సూచించారు. దీంతో ప్రజలు కూడా పోలీసుల అలర్ట్ తో కాసేపు గందరగోళానికి గురయ్యారు.ఆ తర్వాత అంతా తేరుకున్నారు.

నేపాల్లోనూ భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణనష్టం లేదని తేలింది. హిమాలయ ప్రాంతంలో ఉన్న నేపాల్లో ఇంత తీవ్రతతో భూకంపాలు అప్పుడప్పుడూ వస్తూనే ఉంటాయి. అయితే ఈసారి కాస్త తీవ్రంగా అనిపించడంతో కాసేపు భయాందోళనకు లోనయినట్లు తేలింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+