వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆమెను లోబర్చుకున్న న్యూస్ చానెల్ ఎడిటర్.. నమ్మించి ఇలా మోసం!

చానెల్ లో పనిచేసే మహిళా ఉద్యోగినితో సంబంధం పెట్టుకున్న ఆయన.. పెళ్లి చేసుకుంటానని ఆమెను నమ్మించాడు

|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: ప్రముఖ మలయాళం వార్తా చానెల్ మాతృభూమికి చెందిన సీనియర్ జర్నలిస్టు అమాల్ విష్ణుదాస్ పై రేప్ కేసు నమోదైంది. చానెల్ లో పనిచేసే మహిళా ఉద్యోగినితో సంబంధం పెట్టుకున్న ఆయన.. పెళ్లి చేసుకుంటానని ఆమెను నమ్మించాడు. తీరా పెళ్లి మాటెత్తేసరికి ముఖం చాటేస్తుండటంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.

మహిళా ఉద్యోగి ఫిర్యాదు మేరకు మంగళవారం డీసీపీకి ఫిర్యాదు అందడంతో విష్ణు దాస్ ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన్ను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ స్పర్జన కుమార్ తెలిపారు. ఆయనపై సెక్షన-376(రేప్), 377(అసహజ నేరాలు), 506(క్రిమినల్ బెదిరింపు) కింద కేసులు నమోదు చేశామని తిరువనంతపురం సీఐ రియాజ్ తెలిపారు.

 mathrubhumi senior journo amal vishnudas arrested for alleged sexual harassment of junior

ఇక బాధితురాలి వాదనను పరిశీలిస్తే.. మొదటి భార్యతో విడాకులు అవగానే తనను పెళ్లి చేసుకుంటానని విష్ణుదాస్ మాటిచ్చినట్లుగా ఆమె చెప్పారు. విడాకులైతే వచ్చాయి గానీ ఆయన మాత్రం పెళ్లి ప్రస్తావన నుంచి తప్పించుకుంటూ వస్తున్నట్లు పేర్కొన్నారు. అంతేకాదు, తనతో ఎఫైర్ గురించి బయటకు చెబితే తీవ్ర పరిణామాలుంటాయని, కెరీర్ ను నాశనం చేస్తానని హెచ్చరించినట్లుగా చెప్పుకొచ్చారు.

ఇక విష్ణుదాస్ తండ్రి సైతం వైద్య ఖర్చుల పేరుతో తన వద్ద నుంచి భారీగా డబ్బు గుంజాడని ఆమె పేర్కొనడం గమనార్హం.

English summary
The Kerala police has arrested a senior journalist with a prominent Malayalam news channel for allegedly sexually harassing a junior.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X