Matrize-Abp exit poll: ఢిల్లీలో గెలిచేది వారే-తేల్చేసిన మ్యాట్రిజ్-ఏబీపీ ఎగ్జిట్ పోల్..!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారనే అంశంపై మ్యాట్రిజ్-ఏబీపీ ఎగ్జిట్ పోల్ అంచనాలు వెలువడ్డాయి. 70 సీట్లున్న ఢిల్లీ అసెంబ్లీలో అత్యధిక సీట్లు గెలువబోతున్న పార్టీ, ఇతర పార్టీలకు ఎన్ని సీట్లు వస్తాయనే దానిపై మ్యాట్రిజ్-ఏబీపీ పోల్ తన అంచనాలను ప్రకటించింది. ఇందులో ఈసారి కేంద్రంలో బీజేపీ ఢిల్లీలో ఆప్ ఆధిపత్యానికి గండి కొట్టబోతున్నట్లు తెలిపింది.

matrize-abp exit poll predicts winner of delhi assembly election in tight fight

మ్యాట్రిజ్-ఏబీపీ ఎగ్జిట్ పోల్ ప్రకారం 70 సీట్ల ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీ ఈసారి ఏకంగా 35 నుంచి 40 సీట్లు దక్కించుకోబోతున్నట్లు తెలిపింది. అలాగే అధికార ఆప్ కు 32 నుంచి 37 సీట్లు లభించబోతున్నట్లు వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీకి 0 నుంచి 1 సీటు దక్కే అవకాశం ఉన్నట్లు తెలిపింది. దీంతో గత మూడుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఊపుమీదున్న ఆప్ ఆధిపత్యానికి గండిపడటం ఖాయమని మ్యాట్రిజ్-ఏబీపీ ఎగ్జిట్ పోల్ తేల్చేసింది.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ఆప్, బీజేపీ మధ్య గట్టి పోరు సాగింది. ఇరు పార్టీలు విజయం కోసం తీవ్రంగా ప్రయత్నించారు. కేజ్రివాల్ నేతృత్వంలోని ఆప్ వరుసగా నాలుగోసారి డిల్లీలో అధికారం దక్కించుకునేందుకు శ్రమించారు. అయితే కేంద్రంలో మూడోసారి గెలిచినా ఢిల్లీని గెలవలేకపోతున్నారన్న అపప్రదను పోగొట్టుకునేందుకు బీజేపీ నేతలు పక్కా వ్యూహాలు రచించారు. ఈ నేపథ్యంలో మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్ అంచనాలు కాషాయ దళంలో ఊపుతెచ్చాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+