'ఏ క్షణంలోనైనా బీజేపీతో మాయావతి కలుస్తారు'

బీఎస్పీ అధినేత్రి, మాజీ సీఎం మాయావతి ఏ క్షణంలోనైనా బీజేపీతో జతకట్టే అవకాశముందని ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ ఆరోపించారు. ఆమెను కుటిలనీతి గల రాజకీయవేత్తగా సోమవారం నాడు అభివర్ణించారు.

లక్నో: బీఎస్పీ అధినేత్రి, మాజీ సీఎం మాయావతి ఏ క్షణంలోనైనా బీజేపీతో జతకట్టే అవకాశముందని ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ ఆరోపించారు. ఆమెను కుటిలనీతి గల రాజకీయవేత్తగా సోమవారం నాడు అభివర్ణించారు.

మాయావతిని అసలు నమ్మవద్దని సూచించారు. ఆమె ఏ క్షణంలోనైనా బీజేపీ పక్షాన చేరే అవకాశముందన్నారు. ఎస్పీ మళ్లీ అధికారంలోకి రాకుండా బీజేపీ, బీఎస్పీలు చూస్తున్నాయని వ్యాఖ్యానించారు.

తమను అడ్డుకునేందుకు ఆ పార్టీలు ప్రయత్నిస్తున్నాయన్నారు. మాయావతి విషయంలో ఓటర్లు జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు.

Mayawati says she will divide UP into four states, if voted to power

అంతకుముందు రాష్ట్ర అభివృద్ధి గురించి మాయావతి వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. రాష్ట్ర అభివృద్ధికి తమ పార్టీ చేయాల్సిందంతా చేస్తోందన్నారు. ఏ ప్రభుత్వమూ చేయని రీతిలో మెట్రో రైల్వే ప్రాజెక్టును అతి వేగంగా పూర్తి చేశామన్నారు.

కాగా, చాలా ఏళ్లుగా మరుగునపడిన యూపీ విభజన అంశం మళ్లీ ఎన్నికల వాగ్దానంగా ముందుకు వచ్చింది.

నాలుగు దశల పోలింగ్‌ ముగిసిన తర్వాత అయిదో దశ పోలింగ్‌ జరగటానికి ఒకరోజు ముందు బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి వ్యూహాత్మకంగా రాష్ట్ర విభజన అంశాన్ని ముందుకు తీసుకు వచ్చారు. బీఎస్పీ అధికారంలోకి వస్తే 2011లో తమ ప్రభుత్వం ప్రతిపాదించిన పూర్వాంచల్ సహా నాలుగు రాష్ట్రాలను ఏర్పాటు చేస్తుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+