నీట్ పరీక్షలో అడ్డంగా బుక్కయ్యాడు.. తమ్ముడి కోసం ఎంబీబీఎస్ స్టూడెంట్ నిర్వాకం!
ఓ విద్యార్థి అప్పటికే ఎంబీబీఎస్ చదువుతున్నాడు. తనలాగే తన తమ్ముడిని కూడా వైద్యవృత్తిలో చూడాలని ఆశపడ్డాడు. అంతవరకూ బాగానే ఉంది. అయితే, తమ్ముడిని డాక్టర్‌ను చేసేందుకు అతను చేసిన నిర్వాకం ఇప్పడు వారిని కటకటాలపాలు చేసింది. రాజస్థాన్‌లో జరిగిన నీట్ పరీక్షలో ఒకరికి బదులు మరొకరు పరీక్షకు హాజరై అడ్డంగా దొరికిపోయిన ఘటనలో విస్తుపోయే వాస్తవాలు బయటకొచ్చాయి.
ఆదివారం (మే 4) దేశవ్యాప్తంగా నీట్ యూజీపరీక్ష జరిగిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలో రాజస్థాన్‌లో ఓ విద్యార్ధికి బదులు మరొక విద్యార్ధి పరీక్షకు హాజరైన ఘటన వెలుగు చూసింది. రాజస్థాన్‌లోని బార్మర్‌లో తమ్ముడు నీట్ పరీక్ష రాయాల్సి ఉండగా.. అతని అన్నయ్య పరీక్షకు హాజరయినట్లు గుర్తించిన నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఆ సోదరులిద్దరినీ అదుపులోకి తీసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ విచారణలో వారు చెప్పిన సమాధానం విని అధికారులతో పాటు పోలీసులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు.

జోధ్‌పూర్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ విద్యార్థి..
బార్మర్‌లోని 8 పరీక్షా కేంద్రాల్లో ఒకటైన అంత్రిదేవి ప్రభుత్వ హయ్యర్ సెకండరీ పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పరీక్ష రాయాల్సిన అభ్యర్థి గోపాల్ రామ్‌కు బదులుగా అతడి అన్నభగీరథ్ రామ్ పరీక్షకు హాజరయ్యాడు. హాల్‌టికెట్ తనిఖీ చేసిన అధికారులు నకిలీ అభ్యర్థిని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో విచారణ ప్రారంభించిన పోలీసుల ఎదుట వారు నిజాన్ని అంగీకరించారు. తన తమ్ముడిని డాక్టర్‌గా చూడాలనే ఆశతో ఈ పని చేసినట్లు భగిరథ్ రామ్ వెల్లడించాడు. ప్రస్తుతం నిందితుడు భగీరథ్‌తోపాటు, అతడి సోదరుడు గోపాల్ రామ్‌తోపాటు మరో ముగ్గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, భగీరథ్ రామ్ అనేక ప్రయత్నాల తర్వాత గతేడాదే నీట్ యూజీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. ప్రస్తుతం జోధ్‌పూర్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతుండడం ఇక్కడ కొసమెరుపు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications