వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'బర్త్ డే గిఫ్ట్ కింద రోజంతా సెక్స్ కావాలి' : మహిళా సీఈవోకు వేధింపులు

|
Google Oneindia TeluguNews

బెంగుళూరు : పని ప్రాంతాల్లోను మహిళలు వేధింపులకు గురవుతున్న ఘటనలు ఈమధ్య తరుచుగా చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా బెంగుళూరులోని ఓ ప్రైవేటు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, తన వ్యాపార భాగస్వామి అయిన కంపెనీ సీఈవో పైనే వేధింపులకు పాల్పడ్డాడు. లైంగిక వేధింపులు రోజురోజుకు ఎక్కువవుతుండడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే.. జాన్ 53 అనే వ్యక్తితో కలిసి బాధిత మహిళ భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టి ఓ హెల్త్ కేర్ కంపెనీని ప్రారంభించింది. అయితే కంపెనీ మొదలైన నాటి నుంచి జాన్ ఆమెను లైంగికంగా వేధింపులకు గురిచేస్తూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే గత నెల 21వ తేదీన అతని బర్త్ డే సందర్బంగా.. కంపెనీ సీఈవో అయిన బాధిత మహిళను తన ఇంటికి ఆహ్వానించాడు. తీరా.. అక్కడికెళ్లాక మళ్లీ వేధింపుల పర్వం మొదలైంది.

MD demands sex as birthday gift from his CEO; lands in prison

బర్త్ డే గిఫ్ట్ కింద.. ఏకంగా.. ఒకరోజంతా తనతో సెక్స్ లో పాల్గొనాల్సిందిగా.. బర్త్ డే కేక్ కింద తన కామ కోరికను వెలిబుచ్చాడు మేనేజింగ్ డైరెక్టర్ జాన్. సదరు బాధిత మహిళ అతని కోరికను తిరస్కరించడంతో.. ఆఫీస్ లోను తనను ఇష్టమొచ్చిన చోట తాకుతూ ఇబ్బందులకు గురిచేసినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇక వేధింపులను భరించలేక బెంగుళూరులోని బొమ్మనహళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధిత మహిళ,

అయితే విచారణ చేపట్టిన పోలీసులు.. కొన్నాళ్లుగా వాళ్లిద్దరు స్నేహితుల కంటే సన్నిహితంగా మెలుగుతూ వస్తున్నారని చెప్పారు. బిజినెస్ పని మీద చెన్నై, త్రివేండ్రం లాంటి ప్రాంతాలకు వెళ్లినప్పుడు సైతం ఇద్దరు ఒకే రూమ్ లో ఉండేవారని, సదరు బాధిత యువతి తన భర్తకు దూరంగా ఉంటోందని తెలిపారు పోలీసులు. కాగా, బాధిత మహిళ ఫిర్యాదు మేరకు సెక్షన్ 354(ఎ), 506, 509 సెక్షన్ల కింద జాన్ మీద కేసు నమోదు చేసి అతన్ని అదుపులోకి తీసుకున్నట్లుగా పోలీసులు వివరించారు.

English summary
A managing director of a private firm has been accused of sexual harassment as he is believed to have asked his business partner, the CEO of the
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X