సంపన్నులకు వల వేసి సెక్స్, భారీగా డబ్బులు వసూల్, సెక్స్ ముఠా అరెస్ట్

Posted By:
Subscribe to Oneindia Telugu

జైపూర్: గ్యాంగ్ గా ఏర్పాడి భారీ వసూళ్ళకు పాల్పడుతున్న మెగా సెక్స్ రాకెట్ ను పోలీసులు చేధించారు.సంపన్నులతో పరిచయాలను ఏర్పాటు చేసుకొని వారిని రూమ్ కు పిలిచి ఏకాంతంగా గడిపి రేప్ కేసు పెడతానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ ఏడాది నుండి తన కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

ఈ గ్యాంగ్ ఇప్పటివరకు రూ.20 కోట్లకు పైగా అక్రమ వసూళ్ళకు పాల్పడినట్టు సమాచారం. ఆరుగురు యువతులతో సహా మొత్తం 33న, మందిని స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ అరెస్ట్ చేసింది. అరెస్టైన వారిలో ఆరుగురు లాయర్లు కూడ ఉన్నారు.

sex

సెక్స్ రాకెట్ కు చెందిన షికా తివారి ముంబైలోని ఓ హోటల్ లో డీజేగా పనిచేస్తోంది. జైపూర్ కు చెందిన ఓ ప్రముఖ డాక్టర్ ను ట్రాప్ చేసి బ్లాక్ మెయిలకుపాల్పడింది. దీంతో రంగంలోకి దిగిన స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ ఆమెను అదుపులోకి తీసుకొన్నారు.

ఈ గ్యాంగ్ లో ముఖ్యపాత్రపోషిస్తున్న ఆకన్ షా హిజ్ కిల్, ఆమె బోయ్ ఫ్రెండ్ అక్హంత్ శర్మను మంగళవారం రాత్రి ఆజ్మీర్ లో అరెస్ట్ చేశారు. ఈ గ్యాంగ్ సంపన్నులను లక్ష్యంగా చేసుకొని ట్రాప్ లోకి దించి బెదిరింపులకు పాల్పడి అక్రమ వసూళ్ళకు పాల్పడేదని పోలీసుల విచారణలో తేలింది. తమ డిమాండ్లకు ఒప్పుకోకపోతే కొన్ని సందర్బాల్లో బాధితులపై రేప్ కేసులు కూడ నమోదుచేశారని పోలీసులు తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Police have busted a major sex racket, arresting 33 members of a gang that includes six women and six lawyers. The group, active for more than a year, has allegedly extorted more than Rs 20 crore from its victims.
Please Wait while comments are loading...