మేఘాలయ సీఎంగా కాన్రాడ్ సంగ్మా.. హాజరైన ప్రధాని మోడీ

నేషనల్ పీపుల్స్ పార్టీ (NPP)కి చెందిన మొత్తం ఏడుగురు ఎమ్మెల్యేలలో, UDP నుండి ఇద్దరు, BJP, HSPDP నుండి ఒక్కొక్కరు సంగ్మా మంత్రివర్గంలో సభ్యులుగా రాజ్ భవన్ లో ప్రమాణం చేశారు.

మేఘాలయ ముఖ్యమంత్రిగా నేషనల్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు కాన్రాడ్ కె సంగ్మా వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్‌పిపికి చెందిన ప్రిస్టోన్ టైన్‌సాంగ్, స్నియావ్‌భలాంగ్ ధర్‌ ఉపముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రాంతీయ పార్టీల బలాన్ని మరోసారి నొక్కి చెబుతోంది. బీజేపీకి చెందిన అలెగ్జాండర్ లాలూ హెక్, యుడిపికి చెందిన పాల్ లింగ్డో, కిర్మెన్ షిల్లా, హెచ్‌ఎస్‌పిడిపికి చెందిన షక్లియార్ వార్జ్రీ కూడా కాన్రాడ్ కె.సంగ్మాతోపాటు మంత్రులుగా ప్రమాణం చేశారు.

నేషనల్ పీపుల్స్ పార్టీ (NPP)కి చెందిన మొత్తం ఏడుగురు ఎమ్మెల్యేలలో, UDP నుండి ఇద్దరు, BJP, HSPDP నుండి ఒక్కొక్కరు సంగ్మా మంత్రివర్గంలో సభ్యులుగా రాజ్ భవన్ లో ప్రమాణం చేశారు. మేఘాలయ గవర్నర్ ఫాగుచౌహాన్ వీరిచేత ప్రమాణ స్వీకారం చేయించారు.

meghalaya chief minister Conrad Sangma oath ceremony

గవర్నర్ ఫాగు చౌహాన్ రాజ్ భవన్‌లో గోప్యత ప్రమాణం చేయించారు. NPP నుంచి క్యాబినెట్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారిలో మార్క్యూస్ ఎన్ మారక్, రక్కమ్ ఎ సంగ్మా, అంపరీన్ లింగ్డో, కమింగోన్ యంబోన్, ఎటి మోండల్ ఉన్నారు. ఎన్‌పిపి నేతృత్వంలోని కూటమిలో ఎన్‌పిపికి చెందిన 26, బీజేపీకీ చెందిన ఇద్దరు సహా 45 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కొత్తగా ఎన్నికైన 58 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో సభ్యులుగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ తిమోతీ డి.షిరా వారితో ప్రమాణం చేయించారు. కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు.

నాగాలాండ్ ముఖ్యమంత్రిగా వరుసగా ఐదోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు NDPP నేత రియో. 2003లో ఆయన తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన సహా చాలా సంఘటనలు జరిగాయి. ఆ తర్వాత జరిగిన ప్రతీ ఎన్నికలోనూ ఆయన పార్టీయే గెలిచింది. నాగాలాండ్‍‍కు సుదీర్ఘ కాలం పాటు ముఖ్యమంత్రిగా ఉన్న రికార్డు నెఫియూ రియోదే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+