Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

లోటస్ డ్రెస్‌లో మెరిసిన మెలానియా.. రెండో రోజు కెమెరా కళ్లన్నీ ప్రథమ మహిళ వైపే..!

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల భారత పర్యటన సందర్భంగా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్. సోమవారం రోజున వైట్ కలర్ డ్రెస్‌పై ఓ గ్రీన్ కలర్ బెల్ట్ ధరించి చూపరులను ఆకట్టుకున్న మెలానియా మంగళవారం రోజున కూడా వైట్ షేడ్స్‌తో పాటు వివిధ రంగుల్లో ఎంబ్రాయిడింగ్ చేయబడ్డ తామరపువ్వుల డ్రెస్‌తో ఆకట్టుకున్నారు.

లోటస్ డిజైన్ ఉన్న డ్రెస్‌లో మెలానియా

లోటస్ డిజైన్ ఉన్న డ్రెస్‌లో మెలానియా

ఫ్యాషన్ రంగం నుంచి వచ్చిన మెలానియా.. ఇప్పటికీ తన వస్త్రధారణపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. నిన్న ధరించిన డ్రెస్‌కు భారత కనెక్షన్ ఉండగా మంగళవారం ధరించిన ఔట్‌ఫిట్‌పై కూడా ఇండియన్ ట్రెడిషన్ మార్క్ కనిపించింది. వైట్ కలర్ డ్రెస్‌పై పింక్, కాషాయరంగు, నీలం రంగు లోటస్ పూలు ఉన్నాయి. సాధారణంగా వెనెజులాలో ఈ తరహా డ్రెస్సులు ధరిస్తారు. అంతేకాదు వెనెజులాలో లోటస్ పాపులర్ కావడంతో ఎక్కువమంది లోటస్ పూలు ఉన్న డ్రెస్సులనే ధరించేందుకు ఇష్టపడతారు.

మెలానియా డ్రెస్‌పై సోషల్ మీడియాలో చర్చ

మెలానియా డ్రెస్‌పై సోషల్ మీడియాలో చర్చ

ఇక భారత్ విషయానికొస్తే తామరపువ్వు జాతీయ పుష్పంగా పరిగణిస్తాం. అంతేకాదు ఇది బీజేపీ గుర్తుకూడా. అయితే మెలానియా తామరపువ్వులు కలిగి ఉన్న డ్రెస్‌ వేయడం ద్వారా బీజేపీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా లేక జాతీయ పువ్వుకు గౌరవం ఇచ్చేందుకు ఈ డ్రెస్ ధరించారా అనే చర్చ సోషల్ మీడియాలో నడుస్తోంది. అయితే అన్ని రంగుల్లో ఉన్న తామరపువ్వులు ఉన్న డ్రెస్ ధరించి మెలానియా రెండిటికీ అంగీకారం తెలిపారని నెటిజెన్లు చర్చించుకుంటున్నారు. మొత్తానికి మెలానియా ధరించిన డ్రెస్ విలువ మన కరెన్సీలో రూ.1,15,265.

 ట్రంప్‌ రెడ్ కలర్ టైకు మ్యాచింగ్‌గా రెడ్ బెల్ట్ ధరించిన మెలానియా

ట్రంప్‌ రెడ్ కలర్ టైకు మ్యాచింగ్‌గా రెడ్ బెల్ట్ ధరించిన మెలానియా

ఇక మెలానియా డ్రెస్‌పై రెడ్ కలర్ బెల్ట్ ఒకటి ధరించారు. తన భర్త ట్రంప్ వేసుకున్న వైట్ షర్ట్‌ రెడ్ కలర్ టైకు మ్యాచింగ్‌గా ఆమె ధరించారు. వైట్ కలర్ హీల్స్ ధరించారు. నిన్న భారత్‌లో ల్యాండ్ అయినప్పుడు ధరించిన వైట్‌హీల్స్‌నే ఈరోజు కూడా మెలానియా ధరించారు. మొత్తానికి మెలానియా ట్రంప్ భారత పర్యటనలో వైట్ కలర్‌కే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చారు. నిన్న జంప్ సూట్ ధరించి మెలానియా చూపరులను ఆకట్టుకున్నారు. ఈ రోజు వైట్ కలర్ డ్రెస్‌ ధరించి మెప్పించారు. ఢిల్లీలో వాతావరణంకు తగ్గట్టుగా మెలానియా డ్రెస్ ధరించారని కొందరు చర్చించుకున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+