మహిళపై గ్యాంగ్ రేప్: మర్మాంగాల్లోకి ఇనుపరాడ్ జొప్పించి....

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో అత్యంత భయంకరమైన ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీలో 2012 డిసెంబర్ 16వ తేదీన జరిగిన నిర్భయ సామూహిక అత్యాచార ఘటనను తలపిస్తోంది.

బుద్ధి మాంద్యం గల 21 ఏళ్ల గిరిజన మహిళపై అత్యంత దారుణంగా సామూహిక అత్యాచారం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆమెపై తీవ్రంగా దాడి కూడా చేశారు. కూస్మండిలోని సౌత్ దినాజ్‌పూర్‌లో ఆదివారం ఆ సంఘటన చోటు చేసుకుంది.

 ప్రైవేట్ పార్ట్స్‌లోని ఇనుపరాడు

ప్రైవేట్ పార్ట్స్‌లోని ఇనుపరాడు

రాక్షసులు ఆమెపై సామూహిక అత్యాచారం చేయడమే కాకుండా అత్యంత నీచంగా ఆమె ప్రైవేట్ పార్ట్స్‌లోకి ఇనుపరాడ్‌ను జొప్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి దయనీయంగా ఉంది. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఆమె శరీరంపై తీవ్రమైన గాయాలున్నాయి.

 బలవంతంగా ఇలా...

బలవంతంగా ఇలా...

బలవంతంగా ఆమెను నిర్మానుష్యమైన ప్రదేశంలోని వంతెన కిందికి పలువురు దుండగులు లాక్కునిపోయారు. కూస్మండిలోని గ్రామ సంత నుంచి తిరిగి వస్తున్న ఆమెను అలా లాక్కుపోయారు. ఆమెపై అత్యాచారానికి పాల్పడి ఆ తర్వాత ఆమె ప్రైవేట్ పార్ట్స్‌లోకి ఇనుపరాడ్ జొప్పించారు.

 కేకలు విని స్థానికులు...

కేకలు విని స్థానికులు...

మహిళ కేకలు విని స్థానికులు ఆమెకు సహాయంగా వచ్చారు. ఆమెను ప్రభుత్వ ఆధ్వర్యంలోని రాయ్‌గంజ్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అత్యవసర శస్త్రచికిత్స చేశారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మాల్దా వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు.

స్థానికులు ఆందోళనకు దిగారు...

స్థానికులు ఆందోళనకు దిగారు...

ఆ సంఘటన జరిగిన తర్వాత ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానికులు ఆందోళనకు దిగారు. బాధితురాలిని సిసియులో పెట్టారు. ఆమె పూర్తి స్పృహలో లేదని వైద్యులు చెబుతున్నారు. శరీరంలోపల జరిగిన గాయాలను కనిపెట్టడానికి వైద్యులు ఓపెన్ సర్జరీ చేస్తున్నారు.

అనుమానితుడిని అదుపులోకి తీసుకుని...

అనుమానితుడిని అదుపులోకి తీసుకుని...

సంఘటనపై పోలీసు దర్యాప్తు ప్రారంభించాు. విచారణ నిమిత్తం అనుమానితుడిని ఒక్కడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎంత మంది వ్యక్తులు ఈ నేరానికి పాల్పడ్డారనేది పోలీసులు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+