Kamal Haasan: 'నీ పని చూసుకో'..! ట్రంప్ కు కమల్ హాసన్ ఘాటు కౌంటర్..!
ఇరాన్ వార్ నేపథ్యంలో భారత్ చమురు సంక్షోభం ఎదుర్కొంటోంది. పైకి అంతా బాగానే ఉన్నట్లు చెబుతున్నా అంతర్గతంగా ఇబ్బందులు మొదలైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ గ్యాస్ ధరల్ని సైతం కేంద్రం పెంచేసింది. దీంతో హార్ముజ్ జలసంధి వైపు నుంచి రవాణా కాకుండా ఆగిపోయిన చమురు స్ధానంలో రష్యా నుంచి తిరిగి భారత్ చమురు దిగుమతి చేసుకునేందుకు 30 రోజుల పాటు పరిమితంగా అనుమతిస్తున్నట్లు తాజాగా ట్రంప్ (donald trump) ప్రభుత్వం ట్వీట్ చేసింది.
దీనిపై భారత్ లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేసేందుకు అమెరికా అనుమతి ఇవ్వాలా అంటూ సాధారణ ప్రజలు సైతం మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో అలాంటిదేమీ లేదని కేంద్రం సర్దిచెబుతోంది. ఇదే అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను టార్గెట్ చేస్తూ రాజ్యసభ ఎంపీ, మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ (kamal haasan) ఇవాళ ఓ ట్వీట్ చేశారు. ఇందులో ట్రంప్ ను తన పని తాను చూసుకోవాలని సూచించారు.

To
— Kamal Haasan (@ikamalhaasan) March 7, 2026
The President of the United States of America @POTUS
Dear Mr. President,
We, the people of India, belong to a free and sovereign nation. We no longer take orders from distant foreign shores.
Please mind your own business to the best of your abilities.
Mutual respect…
అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్షుడికి అంటూ ఓ లేఖ తరహాలో ట్వీట్ ప్రారంభించిన కమల్ హాసన్.. ప్రియమైన అధ్యక్షా,
భారత ప్రజలమైన మేము స్వేచ్ఛాయుతమైన, సార్వభౌమ దేశానికి చెందినవారం. మేము ఇకపై సుదూర విదేశీ తీరాల నుండి ఆదేశాలను స్వీకరించము. దయచేసి మీ స్వంత పనిని మీ శక్తి మేరకు చూసుకోండి. సార్వభౌమ దేశాల మధ్య పరస్పర గౌరవం శాశ్వత ప్రపంచ శాంతికి ఏకైక పునాది. మీ దేశం మరియు దాని ప్రజలకు శాంతి మరియు శ్రేయస్సును మేము కోరుకుంటున్నాము. ఇట్లు కమల్ హాసన్ , గర్వించదగిన భారతీయ పౌరుడు, మక్కల్ నీది మయ్యం వ్యవస్థాపకుడు అంటూ ట్వీట్ చేశారు.
-
ట్రంప్ ఫోన్లు ఎత్తని ఇరాన్ ? ముందుకెళ్లని చర్చలకు 3 కారణాలు..! -
"ఇరాన్ తో యుద్ధం త్వరలోనే ముగిస్తాం" -
మోదీ-ట్రంప్ వార్ ఫోన్ కాల్ మధ్యలో మస్క్- షాకింగ్ ట్విస్ట్ -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది!












Click it and Unblock the Notifications