బావ అని నమ్మితే నట్టేట ముంచాడు : స్నేహితులతో కలిసి లైంగికదాడి, పంజాబ్‌లో దారుణం
చండీగఢ్ : రోజుకో చోట, ప్రేమ, స్నేహం, బంధువుల పేరుతో మైనర్లపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. నమ్మి రావడమే వారి పాలిట పాపమవుతుంది. నరకచూపించి ... నడిరోడ్డున వదిలేస్తున్న ఉదంతాలు ఎన్నో. తాజాగా చండీగఢ్‌లో కూడా ఓ హృదయ విదారకర ఘటన చోటుచేసుకుంది. ఓ మైనర్‌పై లైంగికదాడి చేసి .. పైశాచిక ఆనందం పొందారు.
యువతి గొంతుకోసిన బావ ..
పంజాబ్‌లోని సెక్టార్ 25లో అమిత్ భార్యతో కలిసి ఉంటున్నాడు. కానీ ఇతనిది వక్రబుద్ధి. వావి వరుస అనేవి ఉండవు. ఈ క్రమంలోనే గత నెల 9 తేదీ తన మరదలు ఇంటికొచ్చింది. తమ వద్దకొస్తే బంగారంలా చూసుకోవాల్సిన బావ .. మరదలిపై కన్నేశాడు. తానొక్కడే కాదు .. తన స్నేహితులతో కూడా లైంగికదాడి చేయించి .. పైశాచిక ఆనందం పొందాడు. ఆ యువతి కదల్లేని పరిస్థితుల్లో ఉండటంతో బంధువులు ఆస్పత్రికి తీసుకెళ్లడంతో విషయం వెలుగుచూసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

స్నేహితులతో కలిసి రేప్ ..
గత నెల 9న తన అక్క వద్దకు 16 ఏళ్ల యువతి వచ్చింది. ఆ మరునాడు మరదలు, తన సోదరితో పాటు హోటల్‌కు వెళ్లాడు అమిత్. తర్వాత సోదరిని తీసుకొని బయటకొచ్చాడు. అయితే అప్పటికే నలుగురు యువకులు ఉన్నారు. వారంతా యువతిపై లైంగికదాడికి తెగబడ్డారు. రాత్రి వచ్చిన బావ కూడా తన కామవాంఛ తీర్చుకున్నాడు. తెల్లవారి రాం దర్బార్ వద్ద గల పర్వీన్ వద్ద వదిలేశాడు. ఇక్కడ కూడా యువతి లైంగిక దాడికి గురైంది. అప్పటినుంచి గతనెల 28 వరకు ఆ నరకకూపంలో ఉన్నది. తర్వాత ఇంటి పక్క గల ఒకరు సాయం చేయడంతో యువతి బయటపడగలిగింది.
ఆమె పరిస్థితి చూసి బంధువులు ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే ఆస్పత్రిలో చేర్చడంతో జరిగిన దురాగతం గురించి తెలిసింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పర్విన్‌ను అదుపులోకి తీసుకున్నారు. యువతి బావ, సహా మరో నలుగురు పరారీలో ఉన్నారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. యువతి లైంగికదాడికి గురైన హోటల్‌ను పోలీసులు సీజ్ చేశారు












Click it and Unblock the Notifications