మిజోరంలో ముగిసిన నామినేషన్లు: ఎంతమంది బరిలో ఉన్నారంటే?
ఐజ్వాల్: మిజోరం అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారంతో ముగియడంతో బరిలో నిలిచిన అభ్యర్థుల వివరాలను అధికారులు వెల్లడించారు. నవంబర్ 7న ఒకే దశలో జరగనున్న మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో 174 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు తెలిపారు.
ఐదు రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను పోటీలో దించగా.. 27 మంది స్వతంత్రులు పోటీలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసిన 174 మంది అభ్యర్థుల్లో 16 మంది మహిళలు ఉన్నారని మిజోరం అదనపు చీఫ్ ఎలక్టోరల్ అధికారి హెచ్ లియాంజెలా తెలిపారు.

2018 ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య తక్కువగానే ఉందని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 20 వరకు నామినేషన్లు స్వీకరించారు. అక్టోబర్ 21న నామినేషన్ల పరిశీలన జరగ్గా.. ఉపసంహరణ గడువు ఈ నెల 23తో ముగిసింది. నవంబర్ 7న పోలింగ్ నిర్వహించి.. మిగతా నాలుగు రాష్ట్రాలతో కలిపి డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
ఈ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 8,56,868 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. కాగా, అధికార మిజో నేషనల్ ఫ్రంట్(ఎంఎన్ఎఫ్), ప్రధాన ప్రతిపక్షం జడ్పీఎం, కాంగ్రెస్ మొత్తం 40 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాయి. బీజేపీ 23 స్థానాల్లో, ఆమ్ ఆద్మీ పార్టీ నాలుగు స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టింది.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ???












Click it and Unblock the Notifications