సీఎం స్టాలిన్ ఆస్తులు ఇవే.. సొంత కారు కూడా లేదట.. మరీ టూ లా లేదు?
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంటోంది. తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ కొళత్తూర్ లో తన నామినేషన్ దాఖలు చేశారు. కొళత్తూర్ నుంచి పోటీ చేయడం స్టాలిన్ కు ఇది నాలుగోసారి కావడం విశేషం. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆయన కొళత్తూర్ నియోజకవర్గంలో రోడ్ షోలో పాల్గొన్నారు. అయితే తన ఎన్నికల అఫిడవిట్ లో ఆస్తుల వివరాలను వెల్లడించారు సీఎం స్టాలిన్.
ఎన్నికల అఫిడవిట్ లో ప్రకటించిన వివరాల ప్రకారం తమిళనాడు సీఎం స్టాలిన్ ఆస్తుల విలువ రూ. 6.26 కోట్లుగా ఉంది. అందులో రూ. 3.30 కోట్ల చరాస్తులు, రూ. 2.96 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. ఇక సీఎం స్టాలిన్ వార్షిక ఆదాయం గత ఆర్థిక సంవత్సరం ప్రకారం రూ. 31 లక్షలుగా ఉంది. అలాగే తన వద్ద ప్రస్తుతం రూ. 10 వేల నగదు ఉన్నట్లు సీఎం స్టాలిన్ అఫిడవిట్ లో పేర్కొన్నారు.
ఇక సీఎం స్టాలిన్ సతీమణి దుర్గా స్టాలిన్ ఆస్తుల వివరాలు చూస్తే.. చరాస్తులు రూ. 1.32 కోట్లు కాగా స్థిరాస్తులు రూ. 2.10 కోట్లుగా ప్రకటించారు. ఆమె వార్షిక ఆదాయం గతేడాది రూ. 5.33 లక్షలు కాగా ప్రస్తుతం దుర్గా స్టాలిన్ చేతిలో రూ. 40 వేలు నగదు ఉన్నట్లు తెలిపారు. ఇక అన్నింటికంటే విచిత్రం ఏంటంటే.. ముఖ్యమంత్రి స్టాలిన్ పేరు మీద ఎటువంటి మోటార్ వాహనాలు లేదా కార్లు లేకపోవడం..

అలాగే సీఎం స్టాలిన్.. తన వద్ద ఎటువంటి బంగారం కానీ వెండి ఆభరణాలు కానీ లేవని ఎన్నికల అఫిడవిట్ లో ప్రకటించారు. అయితే ఆయన భార్య దుర్గా స్టాలిన్ వద్ద మాత్రం 720 గ్రాముల పాత బంగారు ఆభరణాలు (సుమారు 90 తులాల బంగారం) ఉన్నట్లు ప్రకటించారు. వీటి ప్రస్తుత విలువ రూ. 84 లక్షలుగా పేర్కొన్నారు.
ఇక కొళత్తూర్ నియోజకవర్గం నుంచి స్టాలిన్ వరుసగా నాలుగోసారి పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గం నుంచి AIADMK తరఫున సంతాన కృష్ణన్ బరిలోకి దిగుతున్నారు. అలాగే విజయ్ TVK తరఫున వీఎస్. బాబు తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇక NTK పార్టీ నుంచి సౌందర పాండియన్ పోటీ చేస్తున్నారు. ఇక తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 23న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. మే 4న ఫలితాలు వెలువడనున్నాయి.
-
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!!












Click it and Unblock the Notifications