MLA: రెబల్స్ పై శివ సైనికుల పంజా, ఎమ్మెల్యే ఆఫీసు పీస్ పీస్, సీఎంకు సారీ చెప్పాలి, వార్నింగ్ !
ముంబాయి/ గుహవాటి: ఏక్ నాథ్ షిండే గ్రూప్ లో ఉన్న రెబల్ ఎమ్మెల్యే తానాజీ కార్యాలయాన్ని శివసేన కార్యకర్తలు ధ్వంసం చేశారు. మా లీడర్, సీఎం ఉద్దవ్ ఠాక్రే మీద, శివసేన పార్టీ మీద తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలకు ఇదే గతిపడుతుందని శివసేన నాయకుడు సంజయ్ మోరే హెచ్చరించారు. ఏక్ నాథ్ షిండే వర్గంలో ఉన్న రెబల్ ఎమ్మెల్యేలు మర్యాదగా ముంబాయి వచ్చి సీఎం ఉద్దవ్ ఠాక్రేకి క్షమాపణలు చెప్పాలని, లేదంటే ప్రతి ఎమ్మెల్యేకి ఇదే గతిపడుతుందని శివసేన నాయకుడు సంజయ్ మోరే హెచ్చరించారు. ఏక్ నాథ్ షిండే సొంత నియోజక వర్గంలో ఇప్పటికే పోలీసులు 144 సెక్షన్ విధించారు.

రెబల్ ఎమ్మెల్యే ఆఫీసు ధ్వంసం
మహారాష్ట్రలోని శివసేన పార్టీకి చెందిన 38 మంది రెబల్ ఎమ్మెల్యేలు ఏక్ నాథ్ షిండేతో కలిసి అసోంలోని గుహవాటిలోని స్టార్ హోటల్ లో ఉన్న విషయం తెలిసిందే. ఏక్ నాథ్ షిండే గ్రూప్ లో ఉన్న రెబల్ ఎమ్మెల్యే తానాజీ కార్యాలయాన్ని శివసేన కార్యకర్తలు ధ్వంసం చేశారు. పూణేలోని కత్రాజ్ ఉపనగర్ లోని బాలాజీ ప్రాంతంలోని రెబల్ ఎమ్మెల్యే తానాజీ కార్యాలయంపై శనివారం శివసేన కార్యకర్తలు విరుచుకుపడ్డారు.

వార్నింగ్ ఇచ్చిన శివసేన లీడర్
రెబల్ ఎమ్మెల్యే తానాజీకి చెందిన కత్రాజ్ ఉపనగర్ లోని బాలాజీ ప్రాంతంలోని రెబల్ ఎమ్మెల్యే తానాజీ కార్యాలయంపై శనివారం శివసేన కార్యకర్తలు దాడులు చేసిన తరువాత పూణే సిటీ శివసేన పార్టీ అధ్యక్షుడు సంజయ్ మోరే మాట్లాడుతూ మా లీడర్, సీఎం ఉద్దవ్ ఠాక్రే మీద, శివసేన పార్టీ మీద తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలకు ఇదే గతిపడుతుందని సంజయ్ మోరే హెచ్చరించారు.

సీఎంకు క్షమాపణలు చెప్పాలి
సైలెంట్ గా ఉన్న మా శివసైనికులు (శివసేన కార్యకర్తలు) బయటకు వస్తే పరిస్థితులు ఇలాగే ఉంటాయని, ఏక్ నాథ్ షిండే వర్గంలో ఉన్న రెబల్ ఎమ్మెల్యేలు మర్యాదగా ముంబాయి వచ్చి సీఎం ఉద్దవ్ ఠాక్రేకి క్షమాపణలు చెప్పాలని, లేదంటే ప్రతి ఎమ్మెల్యేకి ఇదే గతిపడుతుందని శివసేన నాయకుడు సంజయ్ మోరే హెచ్చరించారు.

హడలిపోతున్న రెబల్ ఎమ్మెల్యేలు
ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న శివసేన కార్యకర్తలు శనివారం ఆందోళనకు దిగడంతో అసోంలోని గుహవాటిలో ఏక్ నాథ్ షిండే గ్రూప్ లో ఉన్న రెబల్ ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారని తెలిసింది. శివసేన పార్టీ రెబల్ లీడర్ ఏక్ నాథ్ షిండే సొంత నియోజక వర్గంలో ఇప్పటికే పోలీసులు 144 సెక్షన్ విధించారు.












Click it and Unblock the Notifications