మొబైల్ ఫోన్ ఎక్కువసేపు మాట్లాడుతున్నారా?

సెల్ ఫోన్లు మన జీవితంలో భాగం అయ్యాయి. ఇంటర్నెట్ కూడా చౌకగా వస్తుండటంతో ఎక్కువమంది ఆ ఫోన్లతోనే సమయాన్ని గడిపేస్తున్నారు. అధిక సమయం మొబైల్ ఫోన్లు వాడటంవల్ల దీర్ఘకాలంలో పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. వారానికి 30 నిమిషాల కన్నా ఎక్కువ సేపు మొబైల్ ఫోన్లు మాట్లాడే వారికి అధిక రక్తపోటు వచ్చే అవకాశం 12 శాతం పెరుగుతోందని చైనా శాస్త్రవేత్తలు తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా మొబైల్ ఫోన్ల సంఖ్యను పరిశీలిస్తే.. 10 సంవత్సరాల వయసు దాటినవారిలో మూడొంతుల మందికి సెల్ ఫోన్లున్నాయి. వీటినుంచి తక్కువ స్థాయిలో ప్రీక్వెన్సీ వెలువడుతుంది. మానవశరీరం ఈ ప్రీక్వెన్సీకి అధిక సమయం గురైతే రక్తపోటు పెరుగుతుందని తేలింది. గుండె పోటు, పక్షవాతానికి ఈ హైబీపీ కారణమవుతోంది.

Cell phones have become a part of our lives.

ఈ సమస్యల వల్ల ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది మరణిస్తున్నారు. బ్రిటన్ లోని బయోబ్యాంక్ నుంచి.. 37 ఏళ్ల నుంచి 73 ఏళ్ల మధ్య వయసు ఉన్న 2 లక్షల మందికి సంబంధించిన డేటాను శాస్త్రవేత్తలు నిశితంగా పరిశీలించారు. వీరంతా సెల్ ఫోన్లలో ఎంత సేపు మాట్లాడుతున్నారనే విషయంపై పరిశోధన చేశారు. 12 సంవత్సరాల తర్వాత వారిని పరిశీలించినప్పుడు 7 శాతం మందిలో అధిక రక్తపోటుకు గురైనట్లు గుర్తించారు. వారానికి అరగంట పాటు మాట్లాడేవారికి 12 శాతం, 30-59 నిమిషాలు ముచ్చటించే వారికి 13 శాతం, 1 నుంచి 3 గంటల సమయం మాట్లాడేవారికి 16 శాతం మేర అధిక రక్తపోటు ముప్పు పెరగొచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు.

మానవ జీవితంలో ఒక భాగంగా మారిపోయిన సెల్ ఫోన్ ను ఎక్కువగా చూడటం వల్ల, ఎక్కువసేపు మాట్లాడటం వల్ల జుట్టు రాలిపోతున్నట్లు తేలింది. సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్, టీవీ, ఇతర స్క్రీన్లు ఎక్కువసేపు చూస్తుంటే కొంతకాలానికి తలపై వెంట్రుకలు రాలిపోవడం ప్రారంభమవుతుందని ఓ అధ్యయనం తెలిపింది. ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని గంటల తరబడి మాట్లాడటంతో వెలువడే రేడియేషన్స్ ఎఫెక్ట్‌తో కూడా జుట్టు రాలిపోతున్నట్లు వెల్లడైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+