పెళ్లి చేసుకుంటానని రేప్ చేసి వదిలేశాడు: మోడల్

 Model cries rape on marriage promise
భోపాల్: ఓ వ్యక్తి పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేసి తనపై అత్యాచారం చేసి తనను వదిలేశాడని ఓ వర్ధమాన మోడల్ ఆరోపించింది. ఆమె ఈవెంట్ మేనేజ్‌మెంట్ కూడా చేస్తుంది. విషమిచ్చి ఆ వ్యక్తి తనను చంపాలని కూడా ప్రయత్నించాడని ఆమె ఆరోపించింది. మంగళవారం ఉదయం ఆమె ఆస్పత్రిలో చేరింది.

పోలీసులు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేస్తున్నారు. గత కొంత కాలంగా నిందితుడు శివం శర్మతో మోడల్‌కు పరిచయం ఉంది. అతను ఓ ప్రాపర్టీ డీలర్ మాత్రమే కాకుండా బ్యాంకర్ కుమారుడు కూడా. విదిషకు చెందిన నిందితుడు తరుచుగా భోపాల్ వస్తుంటాడు.

తన కూతురు నిశ్చితార్థం శివంతో తెగిపోయిందని, వారు వరకట్నం జరగడంతో నిశ్చితార్థం ఆగిపోయిందని మోడల్ తండ్రి మీడియాతో చెప్పాడు. అయినప్పటికీ శివం, మోడల్ ఒకరినొకరు కలుస్తూనే ఉన్నారు. పెళ్లి చేసుకుంటానని శివం మోడల్‌కు హామీ ఇవ్వడంతో వారిద్దరు కలుసుకుంటున్నట్లు చెబుతున్నారు.

పోలీసులు కథనం ప్రకారం - పని మీద అక్టోబర్ 26వ తేదీన మోడల్ ముంబై వెళ్లింది. ఇటార్సి వద్ద రైలు దిగాలని ఆమెకు శివం చెప్పాడు. నవంబర్ 3వ తేదీన పెళ్లి చేసుకుంటానని ఆమెను భోపాల్ తీసుకుని వచ్చాడు. ఆమెను శివం తన మిత్రుడి ఫ్లాట్‌కు తీసుకుని వెళ్లాడు. ఒక రోజు అక్కడ ఉండి ఆ తర్వాత ఇద్దరు కలిసి ఎకో గ్రీన్ సిటీలో ఫ్లాట్ అద్దెకు తీసుకున్నారు.

అక్టోబర్ 31వ తేదీ వరకు ఇద్దరు అక్కడే ఉన్నారు. ఆ తర్వాత అమ్మాయి తన ఇంటికి తిరిగి వచ్చింది. ఆభరణాలతో, పెళ్లి దుస్తులతో నవంబర్ 3వ తేదీన ఆమె మళ్లీ వెళ్లింది. అయితే, శివం ఆమె పట్ల దురుసుగా ప్రవర్తించడమే కాకుండా పెళ్లికి నిరాకరించాడు. ఇరు కుటుంబాల వాళ్లు మాట్లాడుకున్న తర్వాతనే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు.

ఆ తర్వాత ఆమె ఇంటికి తిరిగి వచ్చి నిద్రపోయింది. మర్నాడు ఉదయం పొద్దు పోయే వరకు కూడా లేవకపోవడంతో ఆమెను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకుని వెళ్లారు. తల్లిదండ్రులను, సోదరుడిని సంబోధిస్తూ ఆమె రాసిన సూసైడ్ నోట్ మెత్త కింద దొరికింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+