Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నన్ను చూస్తూ ప్యాంట్ జిప్ తీసి.. మోడల్‌కు భయానక అనుభవం

గురుగ్రామ్‌లో ఒక మోడల్‌కు భయానక అనుభవం ఎదురైంది. మోడల్, డిజిటల్ కంటెంట్ క్రియేటర్ తన క్యాబ్ కోసం వేచి ఉన్న సమయంలో లైంగిక వేధింపులకు గురైంది. ఈ ఘటనపై ఆమె పోలీసుల నిర్లక్ష్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ ఘటనను ఆ మోడల్ తన ఫోన్‌లో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తర్వాతే పోలీసులు స్పందించడం గమనార్హం.

భయానకమైన అనుభవం
గత శుక్రవారం అంటే ఆగస్టు 2న, ఉదయం 11 గంటల సమయంలో సోనీ సింగ్ అనే మోడల్ జైపూర్ నుంచి గురుగ్రామ్‌లోని రాజీవ్ చౌక్ వద్దకు చేరుకుంది. అక్కడ నుంచి తన ఇంటికి వెళ్లడానికి క్యాబ్ బుక్ చేసుకుంది. క్యాబ్ కోసం వేచి ఉన్న సమయంలో ఒక వ్యక్తి ఆమె వైపు వచ్చాడు. అతను వచ్చి ఆమె చుట్టూ తిరుగుతూ చూస్తున్నాడు. ముందుగా ఆమె అతడిని పట్టించుకోలేదు. కానీ ఆ వ్యక్తి ప్యాంటు జిప్ తెరిచి ఆమెను చూస్తూ అసభ్యకరమైన చర్యలు(హస్తప్రయోగం) చేయడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో తనకు చాలా అసహ్యంగా అనిపించిందని సోనీ సింగ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో వివరించారు.

Model Soni Singh in Gurugram was sexually harassed on a busy road

ఆ ఘటన ఆమెను షాక్, నిస్సహాయతకు గురి చేసింది. ఆమె వెంటనే క్యాబ్ డ్రైవర్‌ను సంప్రదించడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఆ వ్యకి నుంచి తప్పించుకోవడానికి ఆమె మరో క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి చేరుకుంది.

పోలీసుల స్పందనపై ప్రశ్నలు
ఇంటికి చేరుకున్న తర్వాత సోనీ సింగ్ ఆ వ్యక్తి అసభ్యకర చర్యలు చేస్తున్న ఫోటోలతో పాటు తన అనుభవాన్ని ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ ఖాతాలలో పంచుకుంది. "పగటిపూట కూడా మహిళలు బహిరంగ ప్రదేశాల్లో ఎందుకు సురక్షితంగా లేరు? ఇలాంటి వక్రబుద్ధి గల వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలి. బహిరంగ ప్రదేశాలు మహిళలకు సురక్షితంగా ఉండాలి" అని ఆమె రాసింది. అయితే, ఆమె పోలీసులను, మహిళా హెల్ప్‌లైన్‌ను సంప్రదించినప్పటికీ ఎవరూ స్పందించలేదని ఆరోపించారు. చివరికి ఆమె పోలీసులతో మాట్లాడగలిగినప్పుడు ఫిర్యాదు నమోదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు రమ్మని చెప్పారని ఆమె తెలిపారు.

సోషల్ మీడియా చలనం.. పోలీసుల చర్య
సోనీ సింగ్ ఆగస్టు 4న ఈ ఘటనను వివరిస్తూ ఒక వీడియోను షేర్ చేసింది. ఆ వ్యక్తిని గుర్తించి న్యాయం జరిగేలా ప్రజల సహాయం కోరింది. ఆమె రైడ్-హెయిలింగ్ యాప్‌లపై కూడా విమర్శలు చేసింది. ఎందుకంటే స్పందించని క్యాబ్ డ్రైవర్ ఆమెను భయాందోళనకు గురి చేశాడు.ఈ వీడియో వైరల్ అయిన రెండు రోజుల తర్వాత, అంటే ఆగస్టు 6న, గురుగ్రామ్ పోలీసులు స్పందించారు. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. పోలీస్ అధికారి సందీప్ మాట్లాడుతూ, నిందితుడి కోసం గాలింపు జరుగుతోందని, అతన్ని గుర్తించడానికి సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని చెప్పారు. ఈ ఘటన, సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం అయిన తర్వాతే పోలీసులు స్పందించారనే విమర్శలకు దారితీసింది. ఇది మహిళల భద్రత, పోలీసుల ప్రతిస్పందనపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+