కాటేసిన కరోనా: పెద్ద తలకాయపై వేటు: డాక్టర్ హర్షవర్ధన్ అవుట్.. సహాయమంత్రి కూడా

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురైన బీజేపీ సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా రాజీనామాలు చేస్తోన్నారు. ఆశించిన స్థాయిలో వారి పనితీరు లేకపోవడం వల్ల వేటు పడుతోంది. ఇప్పటికే కేంద్రమంత్రులు సంతోష్ కుమార్ గంగ్వార్, రమేష్ పోఖ్రియాల్ నిశ్శాంక్, సదానంద గౌడ, దేబశ్రీ చౌదరి, సంజయ్ ధోత్రె, రతన్‌లాల్ కటారియా తమ పదవులకు రాజీనామాలు చేశారు. ఈ సాయంత్రానికి మరిన్ని వికెట్లు నేలకూలే అవకాశాలు ఉన్నాయి. విస్తరణ సందర్భంగా ఉద్వాసనకు గురైన మంత్రులు తమ రాజీనామాలను సమర్పిస్తోన్నారు.

కాగా- ఇప్పటి దాకా రాజీనామా చేసిన వారిలో అప్రాధాన్యత శాఖలకు చెందిన మంత్రులు ఉండగా.. తొలిసారి పెద్ద తలకాయపై వేటు పడింది. ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్‌ తన పదవికి రాజీనామా చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులను సరిగ్గా నిర్వహించలేకపోయారనే కారణంతో డాక్టర్ హర్షవర్ధన్‌ను మంత్రివర్గం నుంచి తప్పించినట్టు తెలుస్తోంది. హర్షవర్ధన్ మాత్రమే కాకుండా.. ఆ శాఖ సహాయమంత్రిని కూడా మంత్రివర్గం నుంచి తప్పించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఆరోగ్యశాఖ సహాయమంత్రి అశ్విని కుమార్ చౌబే కొద్దిసేపటి కిందటే తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ప్రధానికి సమర్పించారు.

Modi cabinet expansion: Health Minister Dr Harsh Vardhan has resigned, as per sources

ఆరోగ్య కారణాల వల్ల పోఖ్రియాల్ రాజీనామా చేయగా.. లాక్‌డౌన్ సమయంలో తలెత్తిన వలస కార్మికుల అంశాన్ని సమర్థవంతంగా నిర్వహించలేకపోయినందు వల్ల ఆ శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్‌పై వేటు పడినట్లు చెబుతున్నారు. ఇదే పరిస్థితిని డాక్టర్ హర్షవర్ధన్ ఎదుర్కొన్నారు. గత ఏడాది వ్యాప్తించిన తొలి విడత కరోనా వైరస్ పరిస్థితుల కంటే సెకెండ్ వేవ్‌ను నిరోధించడంలో.. ఆయన ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయిందని, ఘోరంగా విఫలమైందనే ఆరోపణలు రావడం వల్లే హర్షవర్ధన్‌పై వేటు వేశారనే ప్రచారం హస్తినలో సాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+