Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

దేవెగౌడకు మోడీ శుభాకాంక్షలు: రాహుల్ క్షమాపణలు, ఎందుకంటే.?

బెంగళూరు: మాజీ ప్రధాని దేవెగౌడ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇక కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ కూడా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే, ఈ సందర్భంగా దేవెగౌడకు క్షమాపణలు కూడా చెప్పారు రాహుల్.

Recommended Video

    కర్ణాటక బల పరీక్ష...యడ్యూరప్ప నేగ్గేనా???

    ప్రస్తుతం కర్ణాటక రాజకీయాలు ఉత్కంఠగా సాగుతున్న విషయం తెలిసిందే. ఎన్నికల్లో ప్రధానంగా పోటీ పడిన కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ పార్టీలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఫలితాలు వెలువడిన తర్వాత మాత్రం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు జేడీఎస్ మద్దతు కోసం ఆరాటపడ్డాయి. చివరకు జేడీఎస్.. కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. కాంగ్రెస్ కుమారస్వామికి సీఎం పదవి ఆఫర్ చేయడమే ఇందుకు కారణం.

    Modi, Rahul wish Deve Gowda on his birthday, Rahul also apologises

    ఇది ఇలావుంటే, దేవెగౌడ పుట్టిన రోజు సందర్భంగా.. 'మన మాజీ ప్రధాని దేవెగౌడతో ఇప్పుడే మాట్లాడాను. ఆయన ఆరోగ్యం, జీవితం బాగుండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. ' అని ప్రధాని మోడీ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.

    కాగా, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా దేవెగౌడకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ..' ఆయన ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను' అని ట్వీట్ చేశారు. అయితే జేడీఎస్‌తో సంబంధాలు బలోపేతం చేసే ఉద్దేశంతో గురువారం రాహుల్‌.. దేవెగౌడతో కొద్దిసేపు మాట్లాడారు.

    ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ.. జేడీఎస్ మీద విమర్శనాస్త్రాలు సంధించిన విషయం తెలిసిందే. బీజేపీకి జేడీఎస్‌ టీమ్ బి పార్టీ లాంటిదని ఎద్దేవా చేశారు రాహుల్. అంతేగాక, జనతాదళ్(సెక్యులర్‌)ను కాస్తా జనతాదళ్(సంఘ్‌ పరివార్‌) అని తీవ్రంగా విమర్శించారు.

    ఈ నేపథ్యంలో నాటి వ్యాఖ్యలపై దేవెగౌడకు రాహుల్‌ గాంధీ సారీ చెప్పినట్లు పార్టీ వర్గాల తెలిసింది. కర్ణాటకలో ప్రస్తుతం ఉన్న సందిగ్ధతపై ఎలా ముందుకెళ్లాలన్న విషయంపై కూడా వారు మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. కర్ణాటకలో ఎదురవుతున్న పరిణామాలపై కలిసికట్టుగా పోరాడాలని ఇద్దరు నిర్ణయించినట్లు సమాచారం. అంతేగాక, 2019 సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోడీని ఎదుర్కోవడానికి కాంగ్రెస్‌కు అండగా ఉండాలని ఈ సందర్భంగా దేవెగౌడను రాహుల్ కోరినట్లు తెలిసింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+