Modi Cabinet 2.0 : ఏయే సామాజికవర్గాలకు ప్రాతినిధ్యం... కొత్త కేబినెట్ కూర్పులో 'సమీకరణాలు' ఇవే...

కేంద్ర మంత్రివర్గ పునర్వవ్యస్థీకరణపై అందరి దృష్టి నెలకొంది. కొత్త-పాతల కలయికతో మొత్తం 75 మంది మంత్రులతో కొత్త కేబినెట్ కొలువదీరే అవకాశం ఉంది. సామాజిక సమీకరణాలు,ఆయా రాష్ట్రాల జనాభా,ఇతరత్రా అంశాలను పరిగణలోకి తీసుకుని కొత్త కేబినెట్‌ కూర్పు జరగబోతున్నట్లు తెలుస్తోంది. దళిత సామాజిక వర్గం నుంచి 12 మందికి,ఎస్టీ సామాజిక వర్గం నుంచి 8 మందికి,వెనుకబడిన తరగతుల నుంచి 27 మందికి అవకాశం కల్పించనున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

ఏయే సామాజికవర్గాలకు ప్రాతినిధ్యం...

ఏయే సామాజికవర్గాలకు ప్రాతినిధ్యం...

జాతీయ మీడియా కథనాల ప్రకారం... మోదీ కొత్త కేబినెట్‌లో 'యాదవ్,కుర్మి,దర్జీ,జాట్,గుజ్జార్,ఖండాయత్,బైరాగి,ఠాకూర్,కోలి,వొక్కలిగ,తులు గౌడ,మల్లా' సామాజికవర్గాల వారికి చోటు దక్కనున్నంది.అలాగే మైనారిటీ వర్గాల నుంచి ఐదుగురికి,ముస్లిం,సిక్కు,బుద్దిస్ట్ సామాజికవర్గాల నుంచి ఒక్కొక్కరికి చోటు కల్పించనున్నారు. బ్రాహ్మణ,బనియా,క్షత్రియ,భుమిహార్,కయస్త,లింగాయత్,పటేల్,మరాఠా,రెడ్డి సామాజికవర్గాల నుంచి 29 మందికి అవకాశం కల్పించనున్నారు. మోదీ సర్కార్ నినాదమైన 'సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్' నినాదాన్ని ప్రతిబింబించేలా కొత్త కేబినెట్‌లో వీలైనన్ని సామాజికవర్గాలకు ప్రాధాన్యతనిచ్చేలా కూర్పు ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

కేబినెట్ మంత్రుల సగటు వయసు 58...

కేబినెట్ మంత్రుల సగటు వయసు 58...

మొత్తం 11 మంది మహిళలకు కేబినెట్‌లో చోటు దక్కవచ్చునని తెలుస్తోంది. మంత్రివర్గంలో కొత్త మంత్రుల సగటు వయసు 58గా ఉండవచ్చునని చెబుతున్నారు. ఇందులో 14 మంది సహాయ మంత్రులు,ఆరుగురు కేబినెట్ మంత్రుల వయసు 50 కంటే తక్కువ ఉన్నట్లు తెలుస్తోంది. కొత్తగా కొలువుదీరే కేబినెట్‌లో 46 మంది ఇదివరకే కేంద్రమంత్రులుగా పనిచేసివారు... 23 మంది మూడు,నాలుగుసార్లు ఎంపీగా పనిచేసినవారు... మరో నలుగురు మాజీ ముఖ్యమంత్రులు కాగా.. మరో ఎనిమిది మంది మాజీ మంత్రులు ఉండనున్నట్లు తెలుస్తోంది.

యూపీ,మహారాష్ట్ర,కర్ణాటకల్లో ఆ ప్రాంతాలకు ప్రాధాన్యం

యూపీ,మహారాష్ట్ర,కర్ణాటకల్లో ఆ ప్రాంతాలకు ప్రాధాన్యం

మోదీ కేబినెట్ 2.0లో కొలువుదీరనున్న మంత్రుల్లో 13 మంది లాయర్లు,ఆరుగురు డాక్టర్లు,ఐదుగురు ఇంజనీర్లు,ఏడుగురు సివిల్ సర్వీస్ ఉద్యోగులు ఉన్నట్లు చెబుతున్నారు. మొత్తం 25 రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన నేతలు కేబినెట్‌లో దక్కించుకోనున్నట్లు తెలస్తోంది. ఈశాన్య రాష్ట్రాల నుంచి ఐదుగురికి అవకాశం దక్కున్నట్లు సమాచారం. ఉత్తరప్రదేశ్‌లో పూర్వాంచల్,అవద్,బ్రాజ్,బుందేల్‌ఖడ్,పశ్చిమ్ ప్రదేశ్,హరిత ప్రదేశ్‌ ప్రాంతాలకు చెందిన నేతలకు కేబినెట్‌లో చోటు దక్కే అవకాశం ఉంది. మహారాష్ట్రలో కొంకణ్,ఖండేష్,మరాఠ్ వాడా,విదర్భ ప్రాంతాలకు చెందిన నేతలకు చోటు దక్కవచ్చు.కర్ణాటకలో బాంబే కర్ణాటక,బెంగళూరు కర్ణాటక,హైదరాబాద్ కర్ణాటక,కోస్తా కర్ణాటకలకు చెందిన నేతలకు కేబినెట్‌లో చోటు దక్కే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+