జపాన్ బుల్లెట్ రైళ్లలా: మోడీపై షింజో అబే ప్రశంసలు
న్యూఢిల్లీ: మూడు రోజుల భారత పర్యటనకు వచ్చిన జపాన్ ప్రధాన మంత్రి షింజో అబే శనివారం ప్రధాని మోడీతో కలిసి ఢిల్లీలో జరుగుతున్న భారత్-జపాన్ 9వ వార్షిక సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీపై షింజో అబే ప్రశంసల జల్లు కురిపించారు.
ప్రధాని మోడీ ఆర్ధిక విధానాలు జపాన్ బుల్లెట్ రైళ్లులా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో పౌర అణు ఒప్పందంతోపాటు భారత్‌లో తొలి బుల్లెట్ రైలు ట్రాక్ కోసం రూ.98వేల కోట్ల డీల్, స్మార్ట్‌సిటీలకు సహకారం, పలు మౌలికవసతుల ప్రాజక్టులపై ఒప్పందాలు చేసుకున్నారు.

ఈ ఒప్పందాలు ఇరుదేశాల మధ్య కొత్త అధ్యయాన్ని సృష్టించాయి. అంతక ముందు ప్రధాని మోడీ మాట్లాడుతూ భారత్‌కు కావాల్సింది కేవలం జపాన్ బుల్లెట్ రైళ్ల ఒప్పందమే కాదని, అభివృద్ధిని కోరుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు. 'మేక్ ఇన్ ఇండియా' ప్రాజెక్ట్‌కు జపాన్ చేయూతనిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
మేకిన్ ఇండియా కార్యక్రమం కోసం జపాన్ బిలియన్ డాలర్ల నిధులను కేటాయించిందని ఆయన తెలిపారు. తొలిసారిగా భారత కార్ల కంపెనీ మారుతి సుజుకీ చేసిన కార్లను జపాన్ ఎగుమతి చేసుకుంటుందని ఆయన తెలిపారు. మేకిన్ ఇండియా ఉత్పత్తుల కొనుగోలుకు జపాన్ సుమారు 12 బిలియన్ డాలర్లు కేటాయించినట్లు ఆయన పేర్కొన్నారు.
భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అపరిమితమైన అవకాశాలున్నాయని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. ఎలాంటి సమస్యలు, విబేధాలున్నా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచించారు. జపాన్ సహకారంతో ముంబై-అహ్మాదాబాద్ మధ్య హైస్పీడ్ రైలు మార్గానికి అంగీకారం కుదిరిందన్నారు.
India is all set to welcome its great friend & a phenomenal leader, PM @AbeShinzo. His visit will further deepen India-Japan relations.
— Narendra Modi (@narendramodi) December 11, 2015 インドへようこそ@AbeShinzo あなたの訪問は、印日関係に新たな強さと活力を与えるだろう。
— Narendra Modi (@narendramodi) December 11, 2015 -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications