మోహన్‌లాల్‌కు ఏమైంది..??

Mohanlal: మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ అనారోగ్యానికి గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దీనితో ఆయనను హుటాహుటిన కోచిలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయనకు అత్యాధునిక వైద్య చికిత్సను అందజేస్తోన్నారు డాక్టర్లు.

ప్రస్తుతం బరోజ్ సినిమాలో నటిస్తోన్నారు మోహన్ లాల్. ఈ సినిమాకు దర్శకత్వాన్నీ ఆయన వహిస్తోన్నారు. ట్రెజర్ హంట్ ఫాంటసీ మూవీ ఇది. జిజొ పున్నస్సే రాసిన బరోజ్- ది గార్డియన్ ఆఫ్ డిగామాస్ ట్రెజర్ తెరకెక్కిన పీరియాడికల్ మూవీ ఇది. ఈ పాన్ ఇండియా మూవీ ఏడాది అక్టోబర్ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Mohanlal has been hospitalised in Kochi

ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో తీరిక లేకుండా గడుపుతున్నారు. ప్రమోషన్ వ్యవహారాలనూ పర్యవేక్షిస్తోన్నారు. ఈ పనుల్లో భాగంగా కోచికి వచ్చారాయన. ఈ మధ్యాహ్నం అనారోగ్యానికి గురయ్యారు. ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

దీనితో ఆయనను కోచిలోని ఏఐఎంఎస్ ఆసుపత్రికి తరలించారు. వైరల్ రెస్పిరేటరీ ఇన్‌ఫెక్షన్ బారిన పడినట్లు డాక్టర్లు నిర్ధారించారు. దీనికి అనుగుణంగా ట్రీట్‌మెంట్ అందజేస్తోన్నారు. కనీసం అయిదు రోజులపాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని డాక్టర్ల సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని పేర్కొన్నారు.

మోహన్‌లాల్ ఆసుపత్రి పాలయ్యారనే సమాచారం తెలియడంతో పెద్ద ఎత్తున ఆయన అభిమానులు ఆసుపత్రికి చేరారు. ఆయన క్షేమంగా ఉండాలని ప్రార్థనలు చేశారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే కోలీవుడ్ ఆందోళనకు గురైంది. ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్, ఇండస్ట్రీ ఇన్‌సైడర్ శ్రీధర్ పిళ్లై మోహన్ లాల్ హెల్త్ బులెటిన్‌ను తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.

మోహన్ లాల్ ఆరోగ్య పరిస్థితిపై అప్‌డేట్ ఇచ్చారు. ఆయన డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారని, కొంత విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని వాళ్లు పేర్కొన్నట్లు తెలిపారు. మోహన్ లాల్ ఆరోగ్యం నిలకడగా ఉందని, అభిమానులు ఎవరూ ఆందోళన చెందనక్కర్లేదని, త్వరగా కోలుకుంటారని వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+