వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోనిక దారుణ హత్య: ఏటీఎం వాడి దొరికిన హంతకుడు

|
Google Oneindia TeluguNews

పనాజీ: గోవాకు చెందిన ప్రముఖ పెర్ఫ్యూమ్ డిజైనర్ మోనికా ఘర్దే హత్య కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మోనికా డెబిట్ కార్డు దొంగిలించిన నిందితుడు.. బెంగళూరులో డబ్బులు డ్రా చేయడంతో పోలీసులకు చిక్కాడు. మోనిక హత్య కేసులో ఆమె ఉంటున్న అపార్ట్ మెంటులో గతంలో సెక్యూరిటీగా పని చేసిన రాజ్ కుమార్ సింగ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

సంచలనం రేపుతోన్న డిజైనర్ హత్య : కాళ్లు చేతులు కట్టేసి..

ఆమెకు చెందిన ఓ గొడుకు దొంగిలించడంతో అతడ్ని ఆమె పనిలోనుంచి తీసేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రాజ్ కుమార్.. మోనికాకు చెందిన రెండు ఏటీఎంలను దొంగిలించి ఆమెను హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.

Monika Ghurde murder case: Goa Police nabs security guard

పరారీలో ఉన్న నిందితుడు రాజ్ కుమార్ సింగ్.. మంగళూరు, బెంగళూరు ప్రాంతాల్లో మోనికాకు చెందిన ఏటీఎంలను ఉపయోగించడంతో ట్రాక్ చేసిన పోలీసులు అతడ్ని పట్టుకున్నారు.

కాగా, సంగోల్డాలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న మోనికాతను.. గురువారం అత్యంత దారుణంగా కాళ్లు, చేతులు కట్టేసి నిందితుడు హత్య చేశాడు. ఆమెపై రేప్ చేసి ఈ దారణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

మోనికాను హత్య చేసినట్లు నిందితుడు రాజ్ కుమార్ అంగీకరించాడని పోలీసులు చెబుతున్నారు. అతడు ఆమెను ఎందుకు చంపాడాన్నది స్పష్టంగా తెలియకపోయినా.. ఈ హత్య వెనుక ఇంకెవరూ లేరని, అతడే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. నిందితుడ్ని గోవాకు తరలించి, విచారించనున్నట్లు పోలీసులు తెలిపారు.

కాగా, మోనిక ఒక ఫొటో గ్రాఫర్ ను పెళ్లి చేసుకుని 2011లో గోవాకు వెళ్లింది. అయితే, ఆమె నిరుటి నుంచి భర్తకు దూరంగా ఉంటోంది. ఈ క్రమంలో మోనికను గత గురువారం నిందితుడు ఊపిరాడకుండా చేయడంతో చనిపోయింది.

English summary
Goa police on Sunday arrested a security guard Raj Kumar Singh in Bengaluru in connection with the murder of perfume researcher Monika Ghurde who was found smothered to death on Thursday at Sangolda.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X