షాకింగ్ వీడియో: చిన్నారిని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించిన కోతి..చెయ్యి పట్టుకుని ఈడ్చుకుంటూ..
న్యూఢిల్లీ: సాధారణంగా కోతులు మన చేతుల్లో ఉన్న ఆహార పొట్లాలనో, పండ్లనో లేక కొబ్బరి చిప్పలనో లాక్కెళ్లిపోతుంటాయి. అలాంటి సందర్భాల్లో అదిలిస్తే పారిపోతుంటాయి అవి. ఓ కోతి మాత్రం దీనికి భిన్నంగా ప్రవర్తించింది. ఏకంగా ఓ చిన్నారిని ఎత్తుకెళ్లడానికి ప్రయత్నించింది. దీనికోసం తీవ్రంగా శ్రమించింది. ఎంత తీవ్రంగా అంటే.. పక్కనున్న వాళ్లు అదిలిస్తున్నప్పటికీ.. బెదరనంతగా. ఆ చిన్నారి చెయ్యి పట్టుకుని సుమారు 20 అడుగుల దూరం వరకూ ఈడ్చుకుంటూ తీసుకెళ్లింది.
దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎక్కడ తీసిందో తెలియట్లేదు గానీ..మన దేశంలోనేననేది స్పష్టమౌతోంది. సుశాంత నందా అనే ఐఎఫ్ఎస్ అధికారి ఈ వీడియోను తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అది కాస్తా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ ఘటన పట్ల నెటిజన్లు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీన్ని కూడా లాక్‌డౌన్‌తో ముడిపెడుతున్నారు. లాక్‌డౌన్ ఇలాగే కొనసాగితే.. ఇలాంటి అనర్థాలే చోటు చేసుకుంటాయని వ్యాఖ్యానిస్తున్నారు.

Recommended Video
ఓ అపార్ట్‌మెంట్ ఆవరణలో చోటు చేసుకున్న ఘటన ఇది. అపార్ట్‌మెంట్ల మధ్య ఉండే ఖాళీ స్థలంలో ముగ్గురితో పాటు కలిసి కూర్చుని ఉన్న ఆ చిన్నారిని.. ఎక్కడి నుంచి వచ్చిందో గానీ ఓ కోతి లాక్కెళ్లడానికి ప్రయత్నించింది. అపార్ట్‌మెంట్ మెయిన్ గేటు నుంచి లోనికి ప్రవేశించిన ఆ కోతి.. నేరుగా ఆ చిన్నారి వద్దకే వెళ్లింది. పక్కన మరికొందరు ఉన్నప్పటికీ.. పట్టించుకోలేదు. నేరుగా ఆ చిన్నారి వద్దకు వెళ్లింది. చెయ్యి పట్టుకుని వెనక్కి లాగింది. దీనితో ఆ చిన్నారి గట్టిగా కేకలు వేస్తూ.. కింద పడింది.
అదే ఊపుతో ఆమెను కొంతదూరం పాటు ఈడ్చుకెళ్లింది. ఒకసారి చెయ్యి వదులైనా.. కోతి మాత్రం పట్టు వదల్లేదు. రెండోసారి కూడా చెయ్యి పట్టుకుని మరింత దూరం లాక్కెళ్లిందా కోతి. అదే సమయంలో వెనుక వైపు నుంచి ఓ వ్యక్తి గట్టిగా కేకలు వేస్తూ రావడంతో వదిలేసి పరుగులు తీసింది. ఈ దృశ్యాలన్నీ ఈ వీడియోలో స్పష్టంగా రికార్డు అయ్యాయి. ఓ సాధారణ కోతి.. చిన్నారిని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించడం పట్ల విస్తుపోవాల్సి వస్తోందని సుశాంత నందా వ్యాఖ్యానించారు. ఇలాంటి అరుదైన సంఘటనల మధ్య తాము జీవిస్తున్నామని కామెంట్స్ చేశారు.
We are surely living in strange times😳
— Susanta Nanda IFS (@susantananda3) May 4, 2020
Broad daylight kidnapping attempt by monkey......
VC- Rex pic.twitter.com/04grUaB4eY












Click it and Unblock the Notifications